
‘కేజీబీవీ’లో జీసీడీఓ విచారణ
కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రంలోని కేజీబీవీలో బాలికలను చితకబాదినట్లు తల్లిదండ్రులు చేసిన ఆందోళనతో శనివారం గర్‌ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆధికారి సుప్రియ విచారణ చేపట్టారు. విద్యాలయంలో గణితం టీచర్ సురేఖ బాలికలను పనులు చేయాలని బెదిరిస్తూ చితకబాదుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు విద్యార్థినులను సైతం చితకబాదినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న జీసీడీఓ ఎంఈఓ రహీమోద్దీన్‌తో కలిసి విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడారు. విచారణ నివేదికను డీఈఓతో పాటు కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. కో ఆర్డినేటర్ మాధవి, ఎస్‌ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment