
డీఏలు వెంటనే చెల్లించాలి
టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్
మెదక్‌జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏలను తక్షణమే విడుదల చేయాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం టీఎన్‌జీవో భవన్‌లో పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరల కనుగుణంగా రావాల్సిన డీఏలను ఇవ్వా ల్సిందేనని చెప్పారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసిన కార్యదర్శుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్‌జీవో తూప్రాన్ యూనిట్ అధ్యక్షులు శంకర్ గౌడ్, ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్, రాకేష్, లింగప్ప, రవి, రజిత, రమేష్, నవీన్, శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి, తదితర పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.