80.76% వసూలు | - | Sakshi
Sakshi News home page

80.76% వసూలు

Published Tue, Apr 1 2025 2:02 PM | Last Updated on Tue, Apr 1 2025 2:02 PM

80.76% వసూలు

80.76% వసూలు

ఆస్తి పన్ను
తూప్రాన్‌ ప్రథమం..రామాయంపేట చివరిస్థానం
● జిల్లావ్యాప్తంగా బకాయిలురూ. 13.44 కోట్లు ● వసూలు చేసింది రూ. 10.78 కోట్లు

జిల్లాలో మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో మెదక్‌ మున్సిపాలిటీ గ్రేడ్‌– 2 పరిధిలోకి రాగా ఇది 1953లో ఏర్పడింది. జనాభా 50 వేల పైచిలుకు ఉంది. మిగితా మూడు మున్సిపాలిటీలు 2018 ఆగస్టులో ఆవిర్భవించాయి. ఈ మూడు మున్సిపాలిటీలు గ్రేడ్‌– 3 పరిధిలోకి వస్తాయి. వీటిలో జనాభా 40 వేల లోపు ఉన్నారు. మెదక్‌ బల్దియాలో రూ. 5.54 కోట్ల వివిధ రకాల పన్నులు వసూలు కావాల్సి ఉండగా, రూ. 4.50 కోట్లు వసూలు కాగా ఇంకా రూ. కోటి బకాయి ఉంది. ఈ లెక్కన వసూ లు అయింది 80 శాతం మాత్రమే. అలాగే తూప్రాన్‌ మున్సిపాలిటీలో రూ. 2,62,12,000 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ. 2,23,71,000 కోట్లు చెల్లించారు. ఈ లెక్కన 86 శాతం పన్ను పన్ను వసూళ్లతో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో రూ. 3,74,97,000 కోట్లకు రూ. 3,06,16,000 కోట్లు సిబ్బంది వసూలు చేశారు. ఈ లెక్కన 82.65 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. రామాయంపేట బల్దియాలో రూ. 1,57,00,000 కోట్లకు రూ. 99 లక్షలు మాత్రమే చెల్లించారు. ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లాలోనే రామాయంపేట ఆఖరు స్థానంలో నిలిచింది.

చివరి రోజు రూ. 50 లక్షలు

2024 వార్షిక పన్ను వసూళ్ల కోసం సిబ్బంది అహర్నిశలు శ్రమించారు. మార్చి 31 వరకు పన్ను చెల్లిస్తే పన్నుపై విధించిన వడ్డీకి 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మార్చి 25వ తేదీ నుంచి 31 వరకు పన్ను బకాయి పడిన వారు పెద్ద మొత్తంలో చెల్లించడానికి ముందుకొచ్చారు. ప్రభు త్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకున్నారు. కాగా చివరి రోజు నాలుగు మున్సిపాలిటీల్లో రూ. 50 లక్షల వరకు పన్నులు వసూలు కావడం గమనార్హం.

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి ఈ ఏడాది మార్చి 31 వరకు 80.76 శాతం ఆస్తి పన్ను వసూలైంది. ప్రభుత్వం 90 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడంతో చివరి ఆరు రోజులు పన్ను చెల్లించడానికి ప్రజలు ముందుకొచ్చారు. 86 శాతం ఆస్తి పన్ను వసూళ్లతో తూప్రాన్‌ మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలవగా.. రెండవ స్థానంలో నర్సాపూర్‌, మూడో స్థానంలో మెదక్‌, చివరి స్థానంలో రామాయంపేట నిలిచాయి.

– మెదక్‌జోన్‌

ప్రభుత్వ బకాయిలే ఎక్కవ..

జిల్లావ్యాప్తంగా రూ. 13.44 కోట్లకు గానూ రూ 10.78 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. మిగితా రూ. 2.65 కోట్లు వసూలు కాలేదు. బకాయిపడిన దాంట్లో 90 శాతం వివిధ ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిన స్పందించ లేదని పేర్కొన్నారు.

జిల్లాలో ఆస్తి పన్ను వసూలు ఇలా..

మున్సిపాలిటీ బకాయిలు వసూలైంది చేయాల్సింది

మెదక్‌ రూ. 5.50 కోట్లు రూ. 4.50 కోట్లు రూ. కోటి

రామాయంపేట రూ. 1.57 కోట్లు రూ. 99 లక్షలు రూ. 58 లక్షలు

నర్సాపూర్‌ రూ.3,74,97,000 రూ.3,06,16,000 రూ. 68.81 లక్షలు

తూప్రాన్‌ రూ. 2,62,12,000 రూ. 2,23,71,000 రూ. 38.41 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement