ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇదీ 7.11 పీఎమ్ సినిమా లైన్. హీరో ముందు రోజు రాత్రి భారత్‌లో బస్ ఎక్కితే తర్వాతి రోజు ఉదయం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సముద్రతీరంలో నిద్ర లేస్తాడు. తనకు తెలియకుండానే టైమ్ ట్రావెల్ చేస్తాడు. సాధారణంగా ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అదే కోవలోకి వస్తుందీ మూవీ. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న విడుదలైంది. సాహస్, దీపిక జంటగా నటించగా చైతు మాదాల దర్శకత్వం వహించాడు.
నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన '7.11 పీఎమ్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. రెండు నెలల తర్వాత ఆలస్యంగా ఈ చిత్రం ఓటీటీలో వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ సినిమాలను ఇష్టపడేవారు వీకెండ్‌లో ఓసారి చూసేయండి..
కథ ఏంటంటే?
సినిమా కథ 1999లో జరుగుతుంది. హంసలదీవికి చెందిన రవి(సాహస్) డిగ్రీ పూర్తి చేసి ఐఏఎస్‌కు సన్నద్ధమవుతుంటాడు. ఎమ్మెల్యే సోదరి విమల(దీపికా రెడ్డి)ని ప్రేమిస్తాడు. అతడి గ్రామంలో అపరిమితం మ్యూచువల్ ఫండ్స్ అనే కంపెనీ ఊర్లోవాళ్ల డబ్బంతా దోచుకుని బోర్డు తిప్పడానినికి రెడీ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న రవి ఊరి ప్రజలను కాపాడాలనుకుంటాడు.
అనుకోకుండా ఓరోజు బస్సు రూపంలో ఉన్న టైమ్ మిషన్ ఎక్కుతాడు. తెల్లారేసరికి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిద్ర లేస్తాడు. అంతేకాదు, 1999వ సంవత్సరం నుంచి 2024 కాలంలోకి వెళ్తాడు. అసలు ఆ టైమ్ మిషన్ ఆ ఊరికి ఎలా వచ్చింది? రవి తిరిగి తన కాలంలోకి వచ్చాడా? మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆగడాలను ఎలా అడ్డుకున్నాడు? తాను ప్రేమించిన అమ్మాయిని కలిశాడా లేదా? అన్నది ఓటీటీలో చూసేయండి.
చదవండి: రెండు రోజులకే అన్ని కోట్ల క్లబ్బులో చేరిన జవాన్.. వీకెండ్‌లో అరాచకమే..
Comments
Please login to add a commentAdd a comment