ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్‌ హీరో..! | Aamir Khan for Jr NTR Film With KGF director Prashanth Neel next Film | Sakshi
Sakshi News home page

Jr NTR With Prasanth Neel: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్‌ హీరో..!

Published Sat, Dec 31 2022 8:03 PM | Last Updated on Sat, Dec 31 2022 8:25 PM

Aamir Khan for Jr NTR Film With KGF director Prashanth Neel next Film - Sakshi

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్‌31 అని పేరు పెట్టారు. అయితే తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇటీవల కాలంలో సౌత్, బాలీవుడ్ మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అనేక మంది దక్షిణాది నటులు పాన్-ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. చాలా మంది బి-టౌన్ హీరోలు సౌత్ సినిమాల్లో కనిపించారు. ఇటీవల విడుదలైన మెగాస్టార్‌ మూవీలో సల్మాన్‌ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే.  

(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!)

కేజీఎఫ్ నిర్మాత మాట్లాడుతూ.. 'ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్‌గా ఉన్నా. దయచేసి ఆ సినిమా జోనర్ గురించి నన్నేమీ అడగొద్దు. ఎందుకంటే దానికి ఇంకా చాలా టైం ఉంది. గత 20 సంవత్సరాలుగా ఎన్టీఆర్‌కు అభిమానిని. మేము స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించే ముందు 10 నుంచి 15 సార్లు  కలుసుకున్నాం. అతన్ని కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవాలనుకున్నా. నటీనటులందరితో ఇది నా సాధారణ ప్రక్రియ.' అని అన్నారు.  కాగా.. ఈ ఏడాది అమీర్ ఖాన్ నటించిన చిత్రం'లాల్ సింగ్ చద్దా' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం ఆయన నటనకు విరామం ప్రకటించారు. తాజాగా ప్రశాంత్ నీల్ తన రాబోయే చిత్రంలో  జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అమీర్‌ను కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్ 30 పేరుతో దర్శకుడు కొరటాల శివతో యంగ్‌ టైగర్‌ నటించనున్నారు. ఈ మూవీ జనవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రమిదే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాలార్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నాడు ప్రశాంత్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement