
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తారక్ ఇప్పుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెలలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. దీని తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తోనూ ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
భార్జీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించనుందట. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆమెతో చర్చలు జరపగా దీపికా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక దీపికా ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment