
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్ ఫైల్స్' ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 100 కోట్ల మైలురాయిని అధిగమించిన ఈ చిన్న చిత్రం రూ.150 కోట్లు అందుకునే దిశగా పరుగులు తీస్తోంది. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ఓ వేడుకకు ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను వీక్షించారా? అన్న ప్రశ్నకు ఆమిర్ స్పందిస్తూ ఇప్పటివరకు ఈ సినిమాను చూడలేదు కానీ తప్పకుండా చూసి తీరతానన్నాడు. ఇది మన చరిత్రకు నిదర్శనమని కితాబిచ్చాడు. కశ్మీర్ పండిట్లకు అలా జరగడం నిజంగా బాధాకరమని విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్క భారతీయుడు చూసి తీరాలని పేర్కొన్నాడు. కశ్మీర్ ఫైల్స్ విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందన్నాడు.
చదవండి: ఇది నేను కాదంటున్న వర్మ, అబద్ధాలు చెప్పడం కూడా రావట్లేదా? అంటున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment