ప్రేమ పెళ్లి.. డిప్రెషన్‌లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి! | Actor Kirik Keerthi Announces Divorce With Wife Arpitha Gowda - Sakshi
Sakshi News home page

Kirik Keerthi: ఆమె మెడలో తాళికి, నాకు సంబంధం లేదు.. విడాకులు తీసుకున్నాం

Published Wed, Aug 23 2023 5:00 PM | Last Updated on Wed, Aug 23 2023 6:02 PM

Actor Kirik Keerthi Announces Divorce with Wife Arpitha Gowda - Sakshi

ఇకపై నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆమెకు ఎటువంటి సంబంధం లేదు. దానికి గల కారణం.. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రానికి, నాకు రుణం చెల్లిపో

కన్నడ నటుడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కిర్రిక్‌ కీర్తి విడాకులు తీసుకున్నాడు. తన భార్య అర్పిత గౌడతో విడిపోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 'నేను, అర్పిత చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. భార్యాభర్తలుగా మా ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాం. ఇకపై నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆమెకు ఎటువంటి సంబంధం లేదు. దానికి గల కారణం.. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రానికి, నాకు రుణం చెల్లిపోయింది. తనకు మంచి జీవితం దొరకాలని కోరుకుంటున్నాను. చేదు అనుభవాలను అన్నింటినీ మర్చిపోయి నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాకూ అందించండి' అని రాసుకొచ్చాడు.

ఏడాదిగా విడివిడిగా జీవనం
కీర్తి తమ వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యల గురించి గతంలోనే పరోక్షంగా హింటిచ్చాడు. అటు అర్పిత సైతం సోషల్‌ మీడియాలో తన పేరు చివరన కీర్తిని తొలగించేయడంతో పాటు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను డిలీట్‌ చేసింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభం నుంచే విడివిడిగా జీవిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే అర్పిత తన కొడుకు ఆవిష్కర్‌ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

పేరెంట్స్‌ను ఒప్పించి మరీ పెళ్లి
మరోవైపు కీర్తి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్య ఓ పోస్ట్‌లో అతడు మానసిక ఒత్తిడి ఎక్కువైందని, కొడుకు భవిష్యత్తు కోసం బెంగగా ఉందని పేర్కొన్నాడు. కాగా కిర్రిక్‌ కీర్తి-అర్పితలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట అర్పిత పేరెంట్స్‌ ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ దగ్గరుండి నచ్చజెప్పారు. అలా పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి జరిగి దాదాపు పదేళ్లవుతోంది. గతంలో వీరు జోడి నెం.1 రియాలిటీ షోలోనూ జంటగా పాల్గొని రన్నరప్‌గా నిలిచారు.

చదవండి:  జైలర్‌ నటుడికి రజనీకాంత్‌ మర్చిపోలేని గిఫ్ట్‌.. ఎగిరి గంతేస్తున్న నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement