Actress Dimple Hayathi Performs Pooja With Venu Swamy, Deets Inside - Sakshi
Sakshi News home page

Dimple Hayathi: వేణుస్వామితో డింపుల్ పూజలు.. కారణం అదేనా?

Published Sun, Jun 25 2023 6:04 PM | Last Updated on Mon, Jun 26 2023 12:50 PM

Actress Dimple Hayathi Pooja With Venu Swamy - Sakshi

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు వార్తల‍్లో నిలిచే ఈయన.. గతంలో పలువురు హీరోయిన్లతో పూజలు చేయించారు. రష్మిక, నిధి అగర్వాల్ తదితరులు ఈ జాబితాలో ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో ప్రముఖ హీరోయిన్ చేరింది.

(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి)

హీరోయిన్ డింపుల్ హయాతి గత కొన్నిరోజుల ముందు వార్తల్లో నిలిచింది. జూబ్లీహిల్స్ లోని ఓ అపార్ట్‌మెంట్ లోనే ఉంటున్న ఈమె.. కొత్తగా ఆ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన ఓ పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగింది. పార్కింగ్ కోసమే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సదరు పోలీస్ అధికారి డింపుల్ పై కేసు పెట్టాడు. ఇప్పుడు దాని నుంచి ఉపశమనం పొందేందుకే డింపుల్.. ఈ ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. 

డింపుల్ హయతి ఉంటున్న ఇంట్లో వేదమంత్రాల నడుమ వేణుస్వామి పూజ, యాగం లాంటివి చేశారు. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఖిలాడి, రామబాణం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన డింపుల్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఇండియన్ 2'లో నటిస్తోంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement