
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’.యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 'లైట్ హౌస్ ఆఫ్ మహాసముద్రం' అంటూ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ లుక్ బయటపెట్టింది చిత్ర యూనిట్. తాజాగా మరో హీరోయిన్ అదితిరావు హైదరి పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో ఆమె ‘మహా’అనే క్యారెక్టర్‌లో కనిపించనుంది.
ఈ సినిమా కథ అంతా 'మహా' అనే అమ్మాయి చుట్టూ నడుస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే అదే నిజమే అని తెలిసిపోతుంది. అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Meet #Maha....on her journey of #ImmeasurableLove 🤍#Mahasamudram @ImSharwanand @Actor_Siddharth @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @kishore_Atv @chaitanmusic @Cinemainmygenes @AKentsOfficial pic.twitter.com/tzxPCLemNs
— Aditi Rao Hydari (@aditiraohydari) April 12, 2021