Aditya Mandala Talk About Hostel Days Web Series - Sakshi
Sakshi News home page

‘హాస్టల్ డేస్‌’.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది: ఆదిత్య మండల

Published Wed, Jul 12 2023 5:18 PM | Last Updated on Wed, Jul 12 2023 5:29 PM

Aditya Mandala Talk Abotu Hostel Days web Series - Sakshi

ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా వెబ్‌ సిరీస్‌కి మంచి స్పందన లభిస్తోంది. పలు ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన పరంపర, సేవ్‌ ద టైగర్స్‌, న్యూసెన్స్‌, ఏటీఎం లాంటి వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేశాయి. తాజాగా మరో వెబ్‌ సిరీస్‌లో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఇప్పటికే హిందీ, తమిళ్‌ భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన హాస్టల్‌ డేస్‌ సిరీస్‌ తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కానుంది.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో జులై 13 నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ వెబ్‌ సిరీస్‌కి ఆదిత్య మండల దర్శకత్వం వహించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌గా రాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో భావోద్వేగాలు, నాటకం, వినోదంతో పాటు మంచి సందేశం ఉంటుందని చిత్ర దర్శకుడు ఆదిత్య అన్నారు. ‘హాస్టల్ అంటే నాకు గుర్తు వచ్చేది గ్యాంగ్.  నేటి విద్యార్థులు ఉన్నత విద్యా ప్రపంచంలోని ట్రెండ్ సెట్టర్స్. ఫ్రెండ్ షిప్, బ్రదర్ హుడ్, సిస్టర్ హుడ్ ని ఈ సిరీస్ పోట్రె చేస్తూ కాలేజీ అనుభూతులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదివరకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాలాంటి వారికి ఇది ఈ సిరీస్ మళ్లీ ఆ బెస్ట్ డేస్ కి తీసుకెళ్తుంది’ అని అదిత్య అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement