
Sabhaku Namaskaram: హీరో నరేశ్.. తనను కెరీర్‌పరంగా ఓ మెట్టు ఎక్కించిన అల్లరి సినిమాను తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అలా అప్పటి నుంచి ఏళ్ల తరబడి ప్రేక్షకులతో అల్లరి నరేశ్ అనే పిలిపించుకుంటున్నాడు. నేడు(జూన్ 30) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. తను హీరోగా చేస్తున్న 58వ చిత్రానికి సభకు నమస్కారం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
#Naresh58 is #SabhakuNamaskaram .. a hilarious entertainer with a difference starring @allarinaresh and directed by @MallampatiSate1. Produced by Mahesh S Koneru on @EastCoastPrdns with dialogues by @abburiravi . Shoot begins soon #HBDAllariNaresh pic.twitter.com/JDNFiVMv8C
— BARaju's Team (@baraju_SuperHit) June 30, 2021
ఈమేరకు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే పోస్టర్‌లో కూడా సభకు నమస్కారం చేస్తుండటం ప్రత్యేకతను కనబరుస్తోంది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లంపాటి సతీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సభకు నమస్కారం చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే!
చదవండి: హిందీ కోచింగ్‌కి వెళ్తున్న బెల్లంకొండ.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment