
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్ 7). ఈ సందర్భంగా సినీ ప్రముకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గురువారం ఉదయం నుంచే హైదరాబాదులోని అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానుల బారులు తీరారు. భారి సంఖ్యలో అక్కడి చేరుకొని నినాదాలు చేయడంతో అల్లు అర్జున్ ఇంట్లో బయటకు వచ్చాడు. అభిమానులకు అభివాదం చేశాడు. బర్త్‌డే సందర్భంగా పలువురు ఫ్యాన్స్ అందించిన మొక్కలను కానుకగా స్వీకరించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
కాగా, బన్నీకి ఫ్యాన్స్ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీగా ఎంత ఫాలోయింగ్ వచ్చినా సరే.. అభిమానుల విషయంలో బన్ని . సినిమా సెట్టయినా.. తన సొంత ఇల్లయినా.. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను పలకరించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ‘ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే’ అని తరచు చెబుతుంటాడు అల్లు అర్జున్. కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్.. బుధవారం విడుదల కాగా, యూట్యూబ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వ్యూస్‌ని సొంతం చేసుకుంది.
చదవండి
ఇప్పటికీ ఆ వంద నోటు అల్లు అర్జున్ దగ్గరే ఉంది!
అయ్యయ్యో.. అల్లు అర్జున్ ఫోన్ పోయిందా!
Comments
Please login to add a commentAdd a comment