టాప్‌ 25లో అల్లు అర్జున్‌.. | Allu Arjun In GQ 25 Most Influential Young Indians | Sakshi
Sakshi News home page

ఆ లిస్టులో చేరిన అల్లు అర్జున్‌, అనుష్క

Published Sun, Feb 14 2021 10:45 AM | Last Updated on Sun, Feb 14 2021 10:55 AM

Allu Arjun In GQ 25 Most Influential Young Indians - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్టెప్పులేసిన 'రాములో రాములా..' పాట ఈ మధ్యే 300 మిలియన్ల వీక్షణలు అందుకున్న విషయం తెలిసిందే. బుట్టబొమ్మ పాట కూడా వందలాది మిలియన్ల వ్యూస్‌ అందుకుంటూ తన రికార్డులు తనే బద్ధలు చేస్తోంది. ఈ పాటలే ప్రత్యేకంగా నిలిచిన 'అల వైకుంఠపురంలో' చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ప్రభంజనమే సృష్టించింది. ఈ విజయంలో అల్లు అర్జున్‌ది ముఖ్యమైన పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా బన్నీ ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రముఖ లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ జీక్యూ దేశంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన 25 మంది యంగ్‌ అచీవర్స్‌ జాబితాను రిలీజ్‌ చేసింది. ఇందులో తెలుగు చలన చిత్రసీమ నుంచి బన్నీ ఒక్కడే స్థానం దక్కించుకున్నాడు. బాలీవుడ్ నుంచి అనుష్క శర్మ, ఫిల్మ్‌ మేకర్‌ చైతన్య తమానే, నిర్మాత కర్ణేశ్‌ శర్మ ఈ లిస్టులో చోటు సంపాదించుకున్నారు. వీరితో పాటు క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ కూడా ఉన్నారు.

2020-2021 కాలంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితా:

 రిషభ్‌ పంత్‌, క్రికెటర్‌
► అనుష్కశర్మ, హీరోయిన్‌
► కర్ణేశ్‌ శర్మ: నిర్మాత
► జెహాన్‌ దారువుల, రేసర్‌
► ప్రణవ్‌ పై, సిద్ధార్థ్‌ పై, 3 వన్‌ 4 క్యాపిటల్‌ స్థాపకులు
► డా.నందిని వెల్హో, వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్‌
► అక్షయ్‌ నహేట, సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
► మీనమ్‌ అపాంగ్‌, ఆర్టిస్ట్‌
► కునాల్‌ షా, సీఆర్‌ఈడీ స్థాపకుడు
► దనీష్‌ సైత్‌: డిజిటల్‌ క్రియేటర్‌, కమెడియన్‌
► తరుణ్‌ మెహతా, స్వాప్నిల్‌ జైన్‌, ఆథర్‌ ఎనర్జీ సహ వ్యవస్థాపకులు
► మాధవ్‌ షేత్‌, రియల్‌మీ ఇండియా, యూరప్‌ సీఈవో
► లీజా మంగళ్‌దాస్‌, డిజిటల్‌ క్రియేటర్‌
► బాలా సర్దా, వాదమ్‌ టీస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో
► డా. సూరజ్ యెంగ్డె, స్కాలర్‌, పబ్లిక్‌ ఇంటలెక్చువల్‌
► డా. త్రినేత్ర హల్దార్‌ గుమ్మరాజు, ట్రాన్స్‌ వుమెన్‌ డాక్టర్‌, కంటెంట్‌ క్రియేటర్
► చైతన్య తమనే, ఫిల్మ్‌ మేకర్‌
► అల్లు అర్జున్‌, టాలీవుడ్‌ హీరో
► వరుణ్‌ దేశ్‌పాండే, ద గుడ్‌ ఫుడ్‌ ఇనిస్టిట్యూట్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌
► ఆనంద్‌ విర్‌మాని, అపరాజిత నీనన్‌, నావో స్పిరిట్స్‌ సహ వ్యవస్థాపకులు
► అపర్ణ పురోహిత్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియా హెడ్‌ ఆఫ్‌ ఒరిజినల్స్‌
► క్రిషి ఫగ్వానీ, త్రైవ్‌ సహ వ్యవస్థాపకుడు
► అంబీ, బిందు సుబ్రహ్మణ్యం, సంగీతకారులు, ద సుబ్రహ్మణ్యం అకాడమీ ఆఫ్‌ పర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ స్థాపకులు
► అభిషేక్‌ ముంజల్‌, హీరో సైకిల్స్‌ డైరెక్టర్‌
► బైజు రవీంద్రన్‌, బైజూస్‌ సీఈవో, వ్యవస్థాపకుడు
► కేఎల్‌ రాహుల్‌

చదవండి: చిన్న బ్రేక్‌ తీసుకున్న అల్లుఅర్జున్‌

హీరోయిన్‌ కీర్తి వెడ్డింగ్‌ బెల్స్‌? ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement