తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు ఎప్పుడూ అడ్వాన్స్‌డ్‌గానే ఉంటారు. వారు నటులుగానే కాకుండా చిత్రాలను నిర్మించడం, భారీ మల్టీప్లెక్స్‌లను రన్ చేయడం వంటి వ్యాపారంగంలో కూడా ఎప్పుడో అడుగుపెట్టేశారు. 2018లో ఈ రంగంలో మొదట ఎంట్రీ ఇచ్చింది ప్రిన్స్ మహేశ్ బాబు (AMB) అయితే ఆ తర్వాత ప్రభాస్ సూలురుపేటలో ఎ-పిక్ పేరుతో భారీ థియేటర్ నిర్మించాడు. విజయ్ దేవరకొండ కూడా మహబూబ్‌నగర్‌లో (AVD) పేరుతో మూడు స్క్రీన్స్ ఉన్న మల్టీప్లెక్స్‌ను రన్ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ టార్గెట్ రూ. 5వేల కోట్లు.. పెళ్లి రూమర్స్‌పై ఏమన్నారు?)
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ అమీర్‌పేటలోని సత్యం థియేటర్ స్థానంలో అల్లు అర్జున్ కూడా (AAA) పేరుతో భారీ మల్టీప్లెక్స్ నిర్మించాడు. అందుకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో బన్నీ మరో బిగ్ ప్రాజెక్ట్‌పై కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో టాప్ క్లాస్ మల్టీప్లెక్స్‌ల జాబితాలో (AMB) మొదటి స్థానంలో ఉంటుంది. 'ది గోల్డ్ వెర్షన్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్' అనుభూతిని పొందాలంటే తప్పకుండా 'ఏఎంబీ సినిమాస్'కు వెళ్లాల్సిందే. దీంతో బన్నీ కూడా అదే రేంజ్‌లో మరో మల్టీప్లెక్స్‌ను కోకాపేటలో నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నారట.
హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో కోకాపేట కూడా చేరిపోయింది. అక్కడ అల్లు అరవింద్ గతంలోనే కొంత ల్యాండ్‌ను కొన్నారు. ఇప్పుడు బన్నీకి అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అక్కడే (AAA) మల్టీప్లెక్స్‌ను ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రెండో ప్రాజెక్ట్‌ను మహేశ్ బాబు బెంగళూరులో ఎప్పుడో స్టార్ట్ చేశాడు. త్వరలో అక్కడ కూడా (AMB) పేరుతో ప్రారంభం కాబోతుంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయ్ దేవరకొండ కూడా ఏవీడీ పేరుతోనే హైదరాబాద్‌లో మరో మల్టీప్లెక్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఇండస్ట్రీలోని టాప్ హీరోలు థియేటర్ల నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment