‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. బన్నీకి జోడిగా రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఆమె అటవీ అధికారిణీగా కనిపించనున్నారు. కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా దాదాపు ఏడు నెలల అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. చదవండి: ‘పుష్ప’ షెడ్యూల్ మారింది
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముందుగా శేషాచలం, కేరళ అడవుల్లో జరుపుతారని ప్రచారం జరిగింది. అయితే కరోనా కారణంగా అక్కడ షూటింగ్ చేసేందుకు అనుకూలంగా లేకపోవడంతో షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ప్రస్తుతం విశాఖపట్నం పరిసరాల్లో షూటింగ్ చేసేందుకు చిత్ర బృందం యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువడనుంది. కాగా తక్కువ మందితో కోవిడ్ నియమనిబంధనలకు లోబడి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ముందుగా కోవిడ్ టెస్ట్ చేసుకునేలా నిబంధనలు పెట్టనున్నారు. 2021 మొదలయ్యే నాటికి సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదవండి: స్టైలీష్ స్టార్ పిల్లలా.. మజకా..!
Comments
Please login to add a commentAdd a comment