బుల్లితెర టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్, నటుడు అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం థ్యాంక్ యూ బ్రదర్. రమేష్ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మధ్య సినిమా మోషన్ పోస్టర్‌ను హీరో మహేశ్‌బాబు రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశాడు. మొదటి క్లిప్పింగ్‌లోనే శానిటైజర్ చేతులకు రాసుకుంటూ కరోనా కాలంలో జాగ్రత్తలు తీసుకుంటున్న గర్భిణిగా అనసూయ కనిపించింది. సాధారణంగా పరిచయమయ్యాక గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ లిఫ్టులో అనసూయ పొరపాటున అభి మీద నీళ్లు పోసేయడంతో వాళ్ల మధ్య గొడవ జరిగి ఒకరికొకరు పరిచయమైనట్లు తెలుస్తోంది.
అయితే ప్లేబాయ్ లాంటి అభి, ప్రెగ్నెంట్ అయిన ప్రియ ఓ లిఫ్ట్‌లో ఉండగా పవర్ పోయి, అందులో చిక్కుకుపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయనేది ప్రధాన కథ. "నిన్ను కనేటప్పడు పడ్డ పురిటినొప్పులు ఇప్పటికీ పడుతూనే ఉన్నాన"ని అభి తల్లి చెప్తున్న మాటల్ని బట్టి అతడి క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతుంది. అలాంటివాడు లిఫ్ట్‌లో తనతో పాటు చిక్కుకున్న ప్రెగ్నెంట్ లేడీతో ఎలా ప్రవర్తించాడు, అందమైన కుటుంబం ఉన్న ప్రియ అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుపోయి, పక్కనే ప్లేబాయ్ లాంటి యువకుడితో గడపాల్సి వచ్చి, అందులోనూ పురిటినొప్పులు వస్తే ఏం చేసిందనేది ఉత్కంఠభరితంగా ఉంది. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చే విధంగా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. (చదవండి: మహేశ్ చేతుల మీదుగా ‘థ్యాంక్ యు బ్రదర్’ మోషన్ పోస్టర్)
'థ్యాంక్ యూ బ్రదర్' ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, "థ్యాంక్ యు బ్రదర్ టైటిల్‌తో పాటు ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. చాలా యునిక్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ రమేష్ ఈ సినిమాను చేసినట్లు అనిపించింది. అశ్విన్ విరాజ్, అనసూయ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కోవిడ్ టైమ్‌లో ఈ సినిమాని షూట్ చేశారు. సినిమాలో చాలా సస్పెన్స్, టెన్షన్ ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఒక లిఫ్ట్‌లో చిక్కుకుపోతే ఏమవుతుందో అనే యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. అనసూయ, అశ్విన్‌లకు పర్ఫామ్ చేయడానికి ట్రెమండస్ స్కోప్ ఉన్నట్లు కనిపిస్తోంది. అనసూయ ఔట్‌స్టాండింగ్‌గా నటించినట్లు అనిపిస్తోంది. నిర్మాతలు శరత్, తారక్‌నాథ్‌లకు ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి న్యూ కాన్సెప్ట్‌లను ప్రేక్షకులు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. డైరెక్టర్ రమేశ్ ఇలాంటి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆడియెన్స్ ఈ మూవీని కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల కానున్న ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా చూడాలి." అన్నారు.
అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ, "థ్యాంక్ యు బ్రదర్ నా మనసుకు దగ్గరైన సినిమా. లాక్‌డౌన్ టైమ్‌లో అందరి లాగే నేను కూడా ఏం జరుగుతోందనే ఫీలింగ్‌లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. రమేష్ గారు ఫోన్‌లో నాకు కథ చెప్పారు. కొత్తగా అనిపించింది. కొత్తదనానికి నేను చాలా త్వరగా అడిక్ట్ అయిపోతుంటాను. ఈ కథలో భాగం కావాలని నిజంగా కోరుకున్నాను. లిఫ్ట్‌లో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినప్పుడు జరిగే కథను ఎలా తీస్తారనేది అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ తక్కువమంది యూనిట్‌తో, సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమా తీశారు. అందరూ ఒక ఫ్యామిలీలా మారిపోయి చాలా ఇష్టంగా, ఎంతో తపనతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాని నా ఫస్ట్ ఫిల్మ్‌లాగా ఫీలై చేశాను. వెంకటేష్‌గారు చెప్పినట్లు పర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న సినిమా. వెంకటేష్‌గారు ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు, మా టీమ్‌ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎవరినీ నిరాశపరచదు. విరాజ్ అశ్విన్‌తో కలిసి నటించినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. అతను అమేజింగ్ యాక్టర్. మొదట్లో కొత్తవాళ్లన్నప్పుడు కొంత కంగారుపడ్డాను. కానీ అతను కొత్తవాడిలా కాకుండా చాలా బాగా చేశాడు. నిజానికి నాకంటే అతని క్యారెక్టర్‌లో ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఎలా చేస్తాడో అనుకున్నా కానీ, గొప్పగా చేశాడు." అన్నారు.
విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, "థ్యాంక్ యు బ్రదర్ అనేది కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. డైరెక్టర్ రమేష్‌గారు స్టోరీ చెప్పిన వెంటనే నా క్యారెక్టర్‌ను ప్రేమించేశాను. నెగటివ్ షేడ్ నుంచి పాజిటివ్ షేడ్‌కు వచ్చే క్యారెక్టర్ పోషించాను. నటించడానికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ప్రెగ్నెంట్ లేడీగా అనసూయగారు ఫెంటాస్టిక్‌గా నటించారు. నాలాంటి ఒక కొత్తనటుడికి ఆమె మంచి ప్రోత్సాహం ఇచ్చారు. కొవిడ్ టైమ్‌లోనూ మా టీమ్ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చింది. మంచి మనసున్న వెంకటేష్‌గారు ట్రైలర్ రిలీజ్ చేసి, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్." అన్నారు.
ట్రైలర్ లాంచ్ చేసిన విక్టరీ వెంకటేష్‌కు దర్శక నిర్మాతలు ధన్యవాదాలు తెలుపుతూ, ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో, సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనీ, అందరికీ నచ్చుతుందనీ అన్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫీ, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (చదవండి: క్రేజీ న్యూస్.. బన్నీ, విజయ్ మల్టీస్టారర్!)
Comments
Please login to add a commentAdd a comment