అయ్యో సుమ కష్టాలు చూశారా! నా వల్ల కాదంటున్న యాంకర్‌ | Anchor Suma Kanakala Shares Her GYM Video Goes Viral | Sakshi
Sakshi News home page

Suma Kanakala: యాంకర్‌ సుమ జిమ్‌ వీడియో చూశారా!

Published Fri, Nov 12 2021 6:19 PM | Last Updated on Fri, Nov 12 2021 7:42 PM

Anchor Suma Kanakala Shares Her GYM Video Goes Viral - Sakshi

Anchor Suma Kanakala Shares Her GYM Video: చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశాడు.  విజయ్‌ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తుంది. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై  ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సుమ మళ్లీ వెండితెర రీఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. 

చదవండి: ‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌.. ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాను’

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సుమ ఫటినెస్‌పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తోంది. అంతేగాక ఇందుకోసం తను స్పెషల్ ట్రైనర్‌ని కూడా నియమించుకుంది. తాజాగా జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న తన ఓ వీడియోను సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘2వ సెట్ డంబెల్స్ ఎత్తిన తర్వాత నా చేతులు ఎంత నొప్పిగా ఉన్నాయో వర్ణించలేను.. ఆపమంటాడేమో అని నా ట్రైనర్ రాహుల్ వైపు చూస్తూ ఉంటా.. కానీ అతను మాత్రం ఆ మాట చెప్పడు’ అంటూ సుమ రాసుకొచ్చింది.

చదవండి: ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసిన బామ్మ, ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఫిదా

ఎప్పుడు లేనిది సుమ ఇలా జిమ్‌లో కష్టపడటం చూస్తుంటే అందరికి కాస్తా కొత్తగా ఉంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక సుమను ఇలా చూసి నెటిజన్లు, అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే ఓ వైపు టెలివిజన్ షోలు, మరోవైపు సినిమా ఆడియో పంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లతో క్షణం తీరిగా లేకుండా ఉన్న సుమ ఇలా జిమ్‌లో కూడా కష్టపడుతుంది’ అంటూ పలువురు ఫన్నీగా స్పందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement