
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం యానిమల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవలే సినిమా టీజర్‌ను, ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఇక సాంగ్ వీడియోలో రణ్‌బీర్, రష్మిక కెమిస్ట్రీకి హద్దులేకుండా పోయింది. ఇద్దరూ రొమాన్స్‌లో చెలరేగిపోయారు. అయితే ఈ లిప్‌లాక్ సీన్ల కోసం రష్మిక గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో లిప్‌లాక్ సీన్ కోసం రూ.20 లక్షలు ఛార్జ్ చేసిందట. ఎన్ని ముద్దు సన్నివేశాలు ఉంటే అన్ని రూ.20 లక్షలు ఎక్స్‌ట్రా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రష్మిక ఒక్క సినిమాకు రూ.4 కోట్లు తీసుకుంటోంది.
అయితే లిప్‌లాక్‌కు అదనంగా రూ.20 లక్షలు తీసుకుంటుందన్న విషయం తెలిసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని నిర్మించిన యానిమల్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment