Anushka Shetty Attends RRR Movie Success Party Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Anushka Shetty-RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ సక్సెస్‌ పార్టీలో అనుష్క సందడి, ఫొటోలు వైరల్‌

Published Sun, Mar 27 2022 8:15 PM | Last Updated on Mon, Mar 28 2022 9:54 AM

Anushka Shetty Attends RRR Movie Success Party Photo Goes Viral - Sakshi

జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’మూవీ శుక్రవారం(మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ మూవీని రూపొందించాడు. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సౌత్‌ నుంచి నార్త్‌ వరకు ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియానే కనిపిస్తోంది. నాలుగేళ్ల కష్టానికి జక్కన్న టీంకు ప్రేక్షకుల నుంచి భారీ నీరాజనాలు అందుతున్నాయి. ఇక ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం సంబరాల్లో మునిగితేలుతోంది. 

చదవండి: సమంత స్పెషల్‌ సాంగ్‌, ‘పాన్‌ ఇండియానా బొక్కా?’ సామ్‌ ట్వీట్‌ వైరల్‌

ఈ క్రమంలో శనివారం జరిగిన సక్సెస్‌ పార్టీలో దర్శకుడు రాజ‌మౌళితో పాటు రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, ఎస్ఎస్ కార్తికేయ‌, దిల్ రాజు, ఉపాస‌న‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అలాగే ఈ పార్టీలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ తలుక్కున మెరిసింది. టాలీవుడ్‌ జేజేమ్మ, తెలుగు ప్రేక్షకులు దేవసేన అయిన అనుష్క ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ పార్టీ సందడి చేసింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న స్వీటీ ఇలా రాజమౌళి పార్టీలో కనిపించడంతో ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ఈ పార్టీలో రాంచ‌ర‌ణ్‌తో అనుష్క మాట్లాడుతున్న స్టిల్ ఒక‌టి నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. కాగా అనుష్క ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో మూడు సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జాతి రత్నాలు హీరో నవీన్‌ పోలిశెట్టితో స్వీటీ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీపై బాబు గోగినేని వివాదస్పద రివ్యూ, ఏమన్నాడంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement