
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. మొన్నటివరకు బొద్దుగా, ముద్దుగా కనిపించిన స్వీటీ ఇప్పుడు సన్నబడి క్యూట్‌గా తయారైంది. అగ్ర హీరోల సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలూ చేసిన స్టార్ హీరోయిన్ అనుష్క చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే మిస్ శ్రీట్టి మిస్టర్ పొలిశెట్టితో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కథనార్- ద వైల్డ్ సోర్సరర్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకుగానూ అనుష్క రూ.5-6 కోట్లు డిమాండ్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గతంలో ఒక్క సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి ఐదారుకోట్లు తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ లెక్కన మలయాళ సినిమాకు కూడా దాదాపు అంతే తీసుకుని ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చదవండి: 36 దేశాల్లో ట్రెండ్ అవుతున్న ఇండియన్ సిరీస్.. స్ట్రీమింగ్ అక్కడే!
Comments
Please login to add a commentAdd a comment