Archana: I Quit The Project Because Of Director Nonsense - Sakshi
Sakshi News home page

Archana: ఆ హీరో వంకరగా ఆలోచించేవాడు.. అతడి నిజస్వరూపం..

Published Wed, Nov 3 2021 7:06 PM | Last Updated on Thu, Nov 4 2021 10:14 AM

Archana: I Quit The Project Because Of Director Nonsense - Sakshi

హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అర్చన ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో బిగ్‌బాస్‌ షోలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యిందీ భామ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక తెలుగు డైరెక్టర్‌ తనను నానా హింసించేవాడని పేర్కొంది. 'ఒక డైరెక్టర్‌ ఉన్నాడు. అతడు రోజుకోసారి డైలాగ్‌ మార్చేస్తాడు, రోజుకోసారి స్క్రిప్ట్‌ మార్చేస్తాడు. చాలా నాన్సెన్స్‌ చేశాడు. అతడిని చూశాక మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నా!

అతడు సెట్‌లో డిఫరెంట్‌గా ఉండేవాడు.. కానీ మళ్లీ ఇదెక్కడ సినిమా వదిలేస్తుందోనని అమ్మా, నిన్ను కలుస్తా, ఇంటికొచ్చి మాట్లాడతాను అంటూ నాతో మాటలు కలిపేవారు. అలా ఒకసారి ఆయన మా ఇంటికొచ్చినప్పుడు మీరు చెప్పింది ఒకటి, చేస్తుంది మరొకటి.. ఇది కరెక్ట్‌ కాదు సర్‌ అని చెప్పాను. దీంతో అతడు కాకమ్మ కబుర్లు చెప్తూ తియ్యగా మాట్లాడుతూ నా బ్రెయిన్‌ వాష్‌ చేసేవాడు. అతడి మాటలు విని.. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనుకుని మళ్లీ షూటింగ్‌కు వెళ్లేదాన్ని. కానీ సెట్‌లో చాలా ఇరిటేషన్‌ వచ్చింది. నువ్వు నాకు పైసా కూడా ఇవ్వకు అని ముఖం మీదే చెప్పి వచ్చేశాను. తర్వాత ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది.

 

ఈ సంఘటన కొన్నేళ్ల క్రితం జరిగింది. అతడు మనందరికీ తెలిసిన హీరో, కానీ పెద్దగా సక్సెస్‌ఫుల్‌ హీరో కాదు. ఆయన నాకు తెలీకుండా నా వెనకాల కొన్ని స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారు. చూడటానికి అతడు చాలా సింపుల్‌గా, సీదాగా ఉన్నారనిపిస్తుంది, కానీ అది అతడి నిజస్వరూపం కాదు. వేరే నిజం ఇంకేదో ఉంటుంది. అతడు చాలా వంకరగా ఆలోచించేవాడు. అందమైన అమ్మాయిలు, అందులోనూ ఎవరి అండా లేనివాళ్లు సెట్‌లో ఉన్నారంటే వాళ్ల మైండ్‌ను క్యాప్చర్‌ చేసేందుకు ఇలాంటి వ్యక్తులు రెడీగా ఉంటారు' అని చెప్పుకొచ్చింది అర్చన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement