
వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని లక్షల్లో గిఫ్టులు, డ్రెస్‌లు, బంగారాన్ని కొని మళ్లీ మోకాలి నొప్పి అనడం.. విశ్రాంతి తీసుకోవచ్చు కదమ్మా, కరువులో ఉన్నావా?
పలు టెలివిజన్ షోలలో కనిపిస్తూ బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది బిగ్‌బాస్ భామ అషూ రెడ్డి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్న అషూ తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం దుబాయ్ టూర్‌లో ఉన్న అషూ తన మోకాలికి గాయమైన విషయాన్ని ఫొటో షేర్ చేసి మరీ వెల్లడించింది. 'నా మోకాలికి దెబ్బ తగిలింది. సరిగా నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. కానీ ఈ డ్రెస్ మాత్రం నాకు తెగ నచ్చింది' అని రాసుకొచ్చింది. ఓ పక్క గాయం అంటూనే ఇలా ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చాలామందికి నచ్చలేదు. దీంతో అషూను ఏకిపారేస్తున్నారు.
'ఇదొక ఫ్యాషన్ అయిపోయింది.. ప్రతిసారి దుబాయ్‌కి రావడం, నైట్ హార్డ్‌వర్క్ చేయడం, వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని లక్షల్లో గిఫ్టులు, డ్రెస్‌లు, బంగారాన్ని కొని మళ్లీ మోకాలి నొప్పి అనడం.. విశ్రాంతి తీసుకోవచ్చు కదమ్మా, కరువులో ఉన్నావా? లేక డబ్బు పిచ్చి పట్టిందా?' అని ఓ నెటిజన్ నోటికొచ్చినట్లు కామెంట్ చేసింది. దీనిపై మండిపడ్డ అషూ.. 'నీ చెత్త ఆలోచనలు చచ్చిపోవాలి. నువ్వు బాగా ఆలోచించడానికి ఇంకా ఎదగాలి' అని కూల్‌గా కౌంటర్ ఇచ్చింది. అయినప్పటికీ నెగెటివ్ కామెంట్ల వర్షం ఆగకపోవడంతో సదరు కామెంట్‌ను, తన రిప్లైను డిలీట్ చేసింది.