
Ashu Reddy Surprise Gift To Express Hari: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి బిగ్‌బాస్ అనంతరం ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే ఇటీవలి కాలంలో నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్‌ట్రాక్, ఆ తర్వాత ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషూ మరింత పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా గత కొంత కాలంలో ఓషోలో కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరికి, అషూకి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి : ‘ప్రభాస్-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..!
ఇది వరకే హరి తన గుండెలపై అషూ పేరుతో పచ్చబొట్టు పొడిపించుకొని అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా అషూ సైతం హరిపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. హరి కోసం ఖరీధైన స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేసింది. ఊహించని సర్‌ప్రైజ్‌కి షాక్ అయిన హరి ఇప్పటివరకు తన తల్లిదండ్రులు కూడా ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్ కొనివ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక అషూ సైతం వీడియోను షేర్ చేస్తూ.. 'హరి నీకు ఈ బైక్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. లైఫ్‌లో నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా నా ఆలోచనలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటావు' అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. అషూ మా చిచ్చా(రాహుల్)ని వదిలేస్తున్నావా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
చదవండి : 'మా' ఎన్నికల్లో మరో వివాదం..జీవితపై కంప్లైంట్
Comments
Please login to add a commentAdd a comment