BB7 Latest Promo: Bigg Boss 7 Telugu Season Coming Soon With New Rules And New Challenges - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ఆ కంటెస్టెంట్లకు చుక్కలే! పాపం పసివాళ్లు అంటూ జాలి చూపిస్తున్న నాగ్‌

Published Mon, Jul 31 2023 3:47 PM | Last Updated on Sat, Sep 2 2023 2:34 PM

BB7 Latest Promo: Bigg Boss 7 Telugu Season Coming Soon With New Rules And New Challenges - Sakshi

టీవీల్లో బిగ్‌బాస్‌ మ్యూజిక్‌ వస్తుంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అలర్ట్‌ అయిపోతున్నారు. మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్‌ షో ప్రారంభం కానుందని సంబరపడుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా బిగ్‌బాస్‌ హవా తగ్గుతూ వస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం, హౌస్‌లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు అన్నీ ముందుగా ప్లాన్‌ చేసుకోవడం, బయట కొందరికి డబ్బులిచ్చి ప్రచారం చేయించుకోవడం, అవతలివారిపై నెగెటివిటీ ప్రచారం చేయడం.. ఇలా చాలా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా షో టీఆర్పీ మాత్రం  మెరుగవడం లేదు. రానురానూ ప్రేక్షకాదరణ కూడా తగ్గిపోతూ వస్తోంది.

దీనికి చరమగీతం పాడేందుకు రెడీ అయ్యాడు కింగ్‌ నాగార్జున​. బిగ్‌బాస్‌ 7 గత సీజన్ల మాదిరిగా ఉండదని చెప్తున్నాడు. ఈ మేరకు తాజాగా మరో ప్రోమో రిలీజైంది. 'ఆరు సీజన్లు చూసేశాం.. అంతా మాకు తెలుసనుకుంటున్నారు కంటెస్టెంట్స్‌.. పాపం పసివాళ్లు.. మన ప్లాన్స్‌ వాళ్లకు తెలీవు కదా.. న్యూ రూల్స్‌, న్యూ ఛాలెంజెస్‌, న్యూ బిగ్‌బాస్‌, ఈసారి బిగ్‌బాస్‌ 7.. ఉల్టా పల్టా' అని ప్రోమోలో చెప్పుకొచ్చాడు. నాగ్‌ మాటలు వింటుంటే ఈసారి సీజన్‌ సరికొత్తగా ఉండబోతుందనే అనిపిస్తోంది. అలాగే ముందుగా లెక్కలేసుకుని వచ్చిన కంటెస్టెంట్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది.

బిగ్‌బాస్‌ లవర్స్‌ కూడా అదే కోరుకుంటున్నారు. పాత చింతకాయ పచ్చడిలా కాకుండా ఏదైనా కొత్తగా చేస్తే బాగుండని ఆశిస్తున్నారు. వరుసగా వదులుతున్న ప్రోమోలైతే ఈ సీజన్‌పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇకపోతే గత మూడు సీజన్లుగా బిగ్‌బాస్‌ షో సెప్టెంబర్‌ 3,4,5 తారీఖుల్లోనే ప్రారంభమైంది. ఈ లెక్కన ఈ సీజన్‌ కూడా సెప్టెంబర్‌ 3న ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సర్‌ప్రైజ్‌ ఇద్దామని బిగ్‌బాస్‌ మేకర్స్‌​ ప్లాన్‌ చేస్తే ఒక వారం ముందైనా రావచ్చు. ఏదేమైనా ఈసారి బిగ్‌బాస్‌ కోసం అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఎదురుచూపులకు తగ్గట్లుగా సీజన్‌ ఎంత గ్రాండ్‌గా ఉంటుందో చూడాలి!

చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు కష్టాలు.. అందుకే సూర్యకిరణ్‌-కల్యాణి విడాకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement