భారతీయ బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు పూర్తయిన 14 సీజన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 4వ సీజన్ నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ పాపులారిటీ బిగ్‌బాస్ షోకు మరింత ప్లస్ అయింది. అయితే, అక్టోబర్‌లో మొదలు కానున్న బిగ్‌బాస్ 15వ సీజన్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఆ షో మార్కెట్ ఎంతగా ఉంటుందో తెలియజేస్తోంది.
(చదవండి: Anushka Shetty: చంద్రముఖిగా అనుష్క?)
వచ్చే సీజన్‌కు కూడా హోస్ట్‌గా సల్లూ భాయ్ వ్యవహస్తారనే విషయం తెలిసిందే. దాదాపు 14 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమం కోసం షో నిర్వాహకులు సల్మాన్‌కు సుమారు రూ.350 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే వారానికి రూ.25 కోట్లు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తం ఇదే కావడం విశేషం. ఇక నాలుగో సీజన్‌కు హోస్ట్‌గా చేసినప్పుడు ఈ కండల వీరునికి వారానికి రూ. 2.5 కోట్లు చెల్లించినట్టుగా తెలిసింది.
(చదవండి: Allu Arjun: మరోసారి అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్)
Comments
Please login to add a commentAdd a comment