
ఎమ్‌టెక్ పూర్తిచేసిన దివి వైద్యకు సినిమ అంటే ప్యాషన్. ఆ ఇష్టం పిచ్చిగా మారడం వల్లే మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె నటిగా మారింది. వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. 'మహర్షి' సినిమాలో మహేశ్‌బాబుతో ఓ సన్నివేశంలో కనిపిస్తుంది. సందీప్ కిషన్ లేటెస్ట్ సినిమాలో ఆయన మరదలిగా నటించింది. ఇలా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న ఆమె ప్రేక్షకులకు అంతగా పరిచయం కాలేదు. అందుకే అందరూ సెలబ్రిటీలుగా అయిన తర్వాత బిగ్‌బాస్‌కు వస్తారు. కానీ తాను మాత్రం సెలబ్రిటీ అయ్యేందుకే బిగ్‌బాస్‌లో అడుగు పెట్టానంటోంది. బిగ్‌బాస్‌కు రావడమే తన జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చే విషయమని చెప్తోంది. ఈ షో తనకు అడ్వాంటేజ్ అవుతుందని నమ్ముతున్న దివికి బిగ్‌బాస్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా చూడాలి.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment