
బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు పెద్దగా పరిచయం లేని ముఖాలు. వాళ్లు ఎంత యాక్టివ్‌గా ఉంటే అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో అందరి మీద అరుస్తూ, ఏడుస్తూ కరాటే కల్యాణి, ప్రతిరోజూ ఏడవడమే పనిగా పెట్టుకున్న మోనాల్ గజ్జర్, ఎదుటి వాళ్లను మాట్లాడనివ్వకుండా సూర్య కిరణ్, అప్పుడప్పుడు జోకులు చేస్తూ అమ్మ రాజశేఖర్, డ్యాన్సులతో పాటు ముచ్చట్లు పెడుతూ లాస్య, హారిక. అందరికీ పంచ్‌లు విసురుతూ గంగవ్వ.. ఇలా మిగతా కంటెస్టెంట్లు కూడా ఏదో ఒక రకంగా క్లిప్పింగ్‌లో కనిపిస్తూనే ఉన్నారు. అయితే పొద్దున డ్యాన్స్ చేస్తూ లేదా యోగా చేస్తూ మెరుపు తీగలా క్షణం పాటు కనిపించి వెళ్లిపోయే కంటెస్టెంట్ దివి వైద్య. ఆమె హౌస్‌లో ఉందా లేదా అన్నట్టుగా మెదులుతోంది. (చదవండి: దేత్తడి హారిక: బెడిసి కొట్టిన పబ్లిసిటీ!)
ఎంత పెద్ద గొడవ జరిగినా ఏదీ మాట్లాడకుండా గమ్మున కూర్చోవడంతో ఆమెను 'రేసుగుర్రం'లోని స్పందన పాత్రతో పోలుస్తున్నారు. పైగా మూడు రోజుల నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోయేసరికి "దండం పెడతాం, దివీ.. ఒకే ఒక్కసారి మాట్లాడు" అంటూ సోషల్ మీడియాలో ప్రాధేయపడ్డారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరింది. బిగ్‌బాస్ షో ప్రారంభమైన మూడు రోజుల తర్వాత దివి నోరు విప్పి మాట్లాడుతోంది. ఈమేరకు స్టార్‌మా ఓ ప్రోమోను వదిలింది. ఇందులో అభిజిత్, అమ్మ రాజశేఖర్ గేమ్ గురించి మాట్లాడుతుంటే "నాకు మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది" అని దివి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ ప్రోమోను చూసిన వీక్షకులు 'హమ్మయ్య, దివి మాట్లాడిందోచ్' అని ఎగిరి గంతేస్తున్నారు. 'ఈ జన్మకిది చాలు' అంటూ ఫన్నీ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీ కామెంట్లను, మీమ్స్‌ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి. (చదవండి: శివజ్యోతిని మించిపోయిన మోనాల్)
Game gurinchi okkokkariki vere opinion undi vere Strategy undi😀 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/w5b3umcuYR
— starmaa (@StarMaa) September 10, 2020
Comments
Please login to add a commentAdd a comment