
షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. ఆ క్రేజీ వల్లే బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 5లో షణ్ముఖ్ ఒకడు. షో తొలినాళ్లలో సైలెంట్‌గా, టాస్కులకు దూరంగా ఉన్న షణ్ముఖ్.. రాను రాను తనదైన ఆటశైలీతో అందరిని ఆకట్టుకున్నాడు. తెలివిగా ఆలోచిస్తూ.. తన వేలో గేమ్ ఆడాడు. మిగతా కంటెస్టెంట్స్ వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ‘బిగ్‌బాస్ బ్రహ్మ’గా పేరు సంపాదించుకున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అతను పక్కా టాప్ 2లో తప్పకుండా అతను ఉంటాడని జోస్యాలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాకముందే.. షణ్ముఖ్ బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా ఓ సినిమా రాబోతుందట. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగినప్పటికీ.. షణ్ముఖ్ చాలా రోజులుగా ఇండస్ట్రీలో అవకాశం కోసం చూస్తున్నాడు. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా కూడా చిన్న పాత్రలు కావడంతో నో చెప్పాడు. బిగ్ బాస్ 5 తెలుగు తర్వాత ఈయన ఫాలోయింగ్ మరింత పెరిగిపోవడంతో దర్శక, నిర్మాతలు షన్నూతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారట. త్వరలోనే షణ్ముఖ్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. మరి ఈ యూట్యూబ్ సంచలనం.. వెండితెరపై ఎలా అదరగొడతాడో చూడాలి.