బిగ్‌బాస్ సీజన్-6, 29వ రోజు దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా ఆటలు, పాటలతో చలా సందడిగా సాగింది. అయితే ఆరోహి ఎలిమినేట్ కావడం హౌస్‌మేట్స్‌కు బాగానే షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక సూర్యను ఓదార్చడం ఎవరితరం కాలేదు. చిన్నపిల్లాడిలా ఆరోహి కోసం సూర్య కంటతడి పెట్టాడు. చివర్లో ఆమెకు లవ్ యూ కూడా చెప్పాడు. మరి ఇంకెన్నో విశేషాలను బిగ్‌బాస్29వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం.
బిగ్‌బాస్ షోలో ఆదివారం దసరా స్పెషల్ ఎపిసోడ్ సందడిగా సాగింది. ఆటలు, పాటలు, డ్యాన్సులతో జోష్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌కు నామినేషన్ షాకిచ్చిందనే చెప్పొచ్చు. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో మొదట శ్రీహాన్ సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున ఆ తర్వాత ఇనయా కూడా సేవ్ అయినట్లు చెప్పాడు. ఆ తర్వాత రెండు టీమ్స్‌గా విభజించి చిన్న గేమ్ పెట్టారు. ఇందులో రేవంత్ సేవ్ అయినట్లు తెలిపారు. ఇక చివరగా సుదీప, ఆరహిల మధ్య ఎలిమినేషన్ రౌండ్ సాగింది.
ఇందులో భాగంగా స్టేజ్‌పై రెండు కుండలు ఉంచి, వాటిలో హాట్ వాటర్ పోశారు. ఇందులో ఎవరి కుండలో నుంచి అయితే రెడ్ కలర్ వస్తుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు నాగ్ తేల్చేశారు. ఇక ఈ రౌండ్‌లో తక్కువ ఓట్లతో ఆరోహి ఎలిమినేట్ కావడంతో హౌస్‌మేట్స్ ఒకింత షాక్ అయ్యారు. ముఖ్యంగా సూర్య అయితే ఏడుపు ఆపలేదు. అతన్ని రేవంత్ సహా మిగితా హౌస్‌మేట్స్ ఓదార్చారు. కీర్తి కూడా బాగానే ఎమోషనల్ అయ్యింది.
ఇక స్టేజ్‌పైకి వెళ్లిన ఆరోహికి స్వచ్ఛం, కల్మషం ఎవరో చెప్పాలంటూ చిన్న గేమ్ నిర్వహించారు. ఇందులో స్వచ్ఛం లిస్ట్ లో శ్రీహాన్, బాలాదిత్య, కీర్తి, ఆర్జే సూర్య, వసంతి, మెరీనా రోహిత్‌లను పెట్టిన ఆరోహి..కల్మషం లిస్ట్ లో రేవంత్, చంటి, సుదీప, శ్రీసత్య, ఇనయా, గీతూలను పెట్టింది. ఇక చివర్లో ఆరోహికి సూర్య అందరిముందే ఐ లవ్ యూ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment