![Bigg Boss 7 Telugu: Ambati Arjun as 1st Wildcard Contestant - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/8/Arjun-Ambati.jpg.webp?itok=FDNjKmOW)
చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్ నిజంగానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేశాడు. మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. కానీ తనకు జనాల్లో పేరు తీసుకువచ్చింది మాత్రం సీరియల్సే!
ప్రస్తుతం అతడి చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేనట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్‌బాస్ షోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వచ్చీరావడంతోనే యావర్, ప్రశాంత్ దమ్మున్న గేమ్ ఆడుతున్నారని, అమర్‌దీప్, సందీప్ దుమ్ము దుమ్ముగా ఆడుతున్నారని చెప్పాడు. శివాజీ కర్ర విరగకుండా, పాము చావకుండా ఆడుతున్నాడు, అది హౌస్‌లో ఎవరికీ అర్థం కావట్లేదు, కానీ ఆయన చేసేవన్నీ చేస్తున్నాడని అతడి నిజ స్వరూపం బయటపెట్టాడు. మరి ఇతడు హౌస్‌లోనూ ఇలాగే ముక్కుసూటిగా మాట్లాడతాడా? దుమ్ము రేపేలా ఆడతాడా? లేదా? అనేది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment