![Bigg Boss Fam Meera Mithun Shares Her Biopic New Poster And Gets Trolled By Netizens - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/15/bgg-boss.jpg.webp?itok=ZPn185hF)
ఈ మధ్య కాలంలో నటీమణులు అవకాశాల కోసం తెరపై తమ అందచందాలు ఆరబోస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ, ప్రముఖ తమిళ నటి మీరా మీథున్ నటిస్తున్న ఓ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే మీరా తన విచిత్రమైన వ్యవహర శైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇతర నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్‌టాపిక్‌గా మారుతుంది.
ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న ఓ బయోపిక్ మూవీ నుంచి ఆసభ్యకరమైన పోస్టర్‌ను ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో మీరా ఆభ్యంతరకరమైన దుస్తుల్లో దర్శనం ఇవ్వడంతో నెటిజన్లు, మహిళా సంఘాలు మండిపడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందులో మీరా ‘లోదుస్తులు ధరించి హాట్ లుక్‌లో కనిపించగా.. ఆమె ప్రైవేటు పార్ట్స్‌పై చేయి వేస్తూ పక్కనే ఓ కుర్రాడు కుర్చోని ఉన్నాడు. దీనిని ‘చెక్ అవుట్ మై హాట్‌నెస్’ అంటూ షేర్ చేసింది.
ఈ పోస్టర్ ఆసభ్యకరంగా ఉండటంతో ‘మీరా మరీ శృతిమించి పోతోంది’ అంటూ నెటిజన్‌లు ఆమెపై విమర్శలు గుప్పిస్తుంటే.. అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలబడుతున్నారు. ఎదేమైనా ఈ పోస్టర్ మాత్రం నెట్టింట హల్‌హల్ చేస్తోంది. పోస్టర్‌యే ఇలా ఉంటే ఇక మూవీ ఎలా ఉండబోతుందో అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా మొదట మోడలింగ్ రంగంలో రాణించిన మీరా ఆ తర్వాత తమిళ వెండితెరపై మెరిసింది. ఈ క్రమంలో మీరా తమిళ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యింది.
చదవండి:
విశాల్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు!
రజని, విజయ్‌లపై మీరామిథున్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment