'అవలంబిక'తో వస్తున్న బిగ్‌బాస్‌ ఫేం అర్చన | Bigg Boss Fame Archana New Film Avalambika Release Date Details | Sakshi
Sakshi News home page

'అవలంబిక'తో వస్తున్న బిగ్‌బాస్‌ ఫేం అర్చన

Published Mon, Aug 9 2021 9:08 PM | Last Updated on Mon, Aug 9 2021 9:22 PM

Bigg Boss Fame Archana New Film Avalambika Release Date Details - Sakshi

అర్చన, సుజయ్, మంజూష పొలగాని ముఖ్య పాత్రల్లో పోషిస్తున్న చిత్రం 'అవలంబిక'. షిరిడి సాయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఇటీవలె మెగా బ్రదర్ నాగబాబు  ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఆదిత్య అందించిన మ్యూజిక్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 

ఈ సందర్బంగా దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ .. ఆద్యంతం ఆసక్తితో, ఉత్కంఠతో తెరకెక్కించిన చిత్రమిది. చిత్రీకరణ విషయంలో చాలా కష్టపడ్డాం, అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. ఈ విషయంలో మా నిర్మాత శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్ చాలా ఉంది. ఇందులో ఐదు  పాటలు, ఐదు ఫైట్స్ ఉంటాయి. సోసియో ఫాంటసీ హర్రర్ అంశంలతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి అనిఅన్నారు. కృష్ణ చైతన్య, లావణ్య, వై వి రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా వెంకీ పెద్దాడ, సంగీతం ఉదయ్ కిరణ్, ఎడిటింగ్ : శ్రీ చందు, ఆర్ట్ : రవిబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement