బిగ్‌బాస్‌ 7.. ఇప్పటివరకు ఫైనలైన కంటెస్టెంట్లు వీళ్లే! | Bigg Boss 7 Telugu Contestants List Goes Viral, Know Starting Date And Who's Entry Confirmed - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Contestants Details: ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేదు..లిస్టులో 20 మందికి పైగా కంటెస్టెంట్లు! కమెడియన్స్‌ నుంచి హీరోల దాకా..

Published Thu, Aug 24 2023 2:45 PM | Last Updated on Sat, Sep 2 2023 4:45 PM

Bigg Boss Telugu 7 Complete List Details - Sakshi

బిగ్‌బాస్‌ షో.. ఇచట అన్ని ఎమోషన్స్‌ లభించును. ఇంటికి, సోషల్‌ మీడియాకు దూరంగా వంద రోజులు కొత్త ఇంట్లో తెలియనివారితో కలిసి ఉండటం అంటే మామూలు విషయం కాదు! నచ్చినా నచ్చకపోయినా అక్కడే ఉండాలి. అలవాటు లేకపోయినా సరే ఇంటి పని, వంటపని అన్నీ చేసి తీరాలి. ఎన్ని గొడవలు జరిగినా సరే, మరుక్షణమే ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలి. స్నేహాలు, లవ్‌ కహానీలు, గిల్లికజ్జాలు, ఆటలు, పాటలు, కోతిచేష్టలు, కుప్పిగంతులు, ఎత్తుకు పైఎత్తులు, చిరాకుపరాకులు, కోపావేశాలు.. అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి. 

ప్రేక్షకులు రెడీ..
మరి ఇంత సందడి ఉందంటే ఎవరికి మాత్రం నచ్చదు.. అందుకే బుల్లితెర ప్రేక్షకులు బిగ్‌బాస్‌ వస్తుందంటే చాలు వారి టైం టేబులే మార్చేస్తారు. ఠంచనుగా షో ప్రసారమయ్యే సమయానికి పనులన్నీ మాని టీవీలకు అతుక్కుపోతారు. ఈ ఆదరణ చూసే వరుసగా సీజన్లు వస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్‌ 3న బిగ్‌బాస్‌ 7వ సీజన్‌ వస్తోంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. మరి బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టేది ఎవరు? ఎవరి పేర్లు ఈ మధ్య మార్మోగిపోతున్నాయి? ఎంతమంది హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్‌ ఉంది? అనే వివరాలను ఓసారి చూసేద్దాం..

ఏయే సెలబ్రిటీలు లిస్ట్‌లో ఉన్నారంటే?
అమర్‌దీప్‌ (నటుడు), అనీల్‌ జీల (మై విలేజ్‌ షో యూట్యూబర్‌), అంజలి పవన్‌ (నటి), ఆట సందీప్‌ (కొరియోగ్రాఫర్‌), పూజా మూర్తి (నటి), ప్రిన్స్‌ యావర్‌ (మోడల్‌, నటుడు), షీతల్‌ గౌతమ్‌(యూట్యూబర్‌), రంగస్థలం మహేశ్‌(నటుడు), శోభా శెట్టి (కార్తీకదీపం నటి), దామిని భట్ల(సింగర్‌), సాగర్‌ (మొగలిరేకులు హీరో), టేస్టీ తేజ (యూట్యూబర్‌, జబర్దస్త్‌ కమెడియన్‌), గౌతమ్‌ కృష్ణ (హీరో), కెవ్వు కార్తీక్‌ (జబర్దస్త్‌ కమెడియన్‌), భోలే షావలి(సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌), ఫర్జానా (హీరోయిన్‌, కొరియోగ్రాఫర్‌), క్రాంతి (నటుడు), యువ సామ్రాట్‌ (యూట్యూబర్‌) దాదాపు కన్‌ఫార్మ్‌ అయినట్లు సమాచారం.

వారిలో ఎవరొస్తారు?
యాంకర్‌ ప్రత్యూష పేరు గత సీజన్‌లోనూ వినిపించింది. అయితే ఈసారి ఫైనలయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి ప్రియాంక జైన్‌ పేరు పెద్దగా ప్రచారం లేకపోయినప్పటికీ చివర్లో మాత్రం తను రానున్నట్లు టాక్‌ నడుస్తోంది. రియాజ్‌, జబర్దస్త్‌ నరేష్‌లలో ఎవరో ఒకరు ఉండే ఛాన్స్‌ ఉంది. బుల్లెట్‌ భాస్కర్‌, షకీల, అబ్బాస్‌, శుభశ్రీ రాయగురు (హీరోయిన్‌), ప్రభాకర్‌తో కూడా బిగ్‌బాస్‌ టీమ్‌ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మరి వీరు ఆఫర్‌కు ఓకే చెప్పారా? లేదా? తెలియాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్‌ (యూట్యూబర్‌) రైతు బిడ్డగా చాలా వీడియోలు చేశాడు. బిగ్‌బాస్‌కు వెళ్లాలనుందని ఎన్నో సార్లు చెప్పిన అతడు కూడా షోలో అడుగుపెట్టనున్నట్లు టాక్‌. వీరిలో కొందరిని వైల్డ్‌ కార్డ్‌ కోసం పక్కన పెట్టే అవకాశాలూ లేకపోలేదు!

చదవండి: సీనియర్‌ నటి కన్నుమూత.. నడవడం కూడా మర్చిపోయి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement