Bigg Boss Telugu 7 Latest Promo: Get Ready For An Epic Season Awaits - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: రాధా రమేశ్‌.. రసవత్తరంగా ప్రోమో.. అంతం కాదిది ఆరంభం అంటున్న నాగ్‌

Published Thu, Aug 10 2023 8:20 PM | Last Updated on Sat, Sep 2 2023 2:14 PM

Bigg Boss Telugu 7 Latest Promo: Get Ready For An Epic Season Awaits - Sakshi

బిగ్‌బాస్‌ షో.. ఎవరెన్ని తిట్టుకున్నా ఈ షోకున్న క్రేజే వేరు.. అసలీ షో ఎందుకో? దీన్నెవరు చూస్తారో? అని విమర్శించే ఎంతోమంది ఎపిసోడ్‌ మొదలవగానే చూపు తిప్పుకోకుండా కళ్లప్పగించి మరీ చూస్తారు. అయితే ఈ మధ్య వరుసగా బిగ్‌బాస్‌ నిరాశపరుస్తూ వస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం ఓ కారణమైతే.. ఆ వచ్చినవారు కూడా అన్నీ ముందే ప్రిపేర్‌ అయి రావడంతో షోలో పస లేకుండా పోతోంది. దీన్ని అరికట్టేందుకు ఈసారి బిగ్‌బాస్‌ టీమ్‌ గట్టిగానే ప్లాన్‌ చేసినట్లు కనిపిస్తోంది.

తాజాగా బిగ్‌బాస్‌ 7 కొత్త ప్రోమో రిలీజైంది. రమేశ్‌ - రాధల పాత్రతో ప్రోమో ఓ రేంజ్‌లో ఉంది. ఇంతకీ వీళ్లెవరంటారా? ఓ ప్రేమజంట.. రమేశ్‌ కొండ మీది నుంచి జారిపోయి పడబోతుంటే రాధ పై నుంచి చున్నీ ఇచ్చి పట్టుకోమంటుంది. ఇది నాగార్జునకు నచ్చలేదు. ఇలాంటి క్లైమాక్స్‌లు మనం బోలెడు చూశాం కదా, ఎండింగే మార్చేద్దాం.. ఇది అంతం కాదు ఆరంభం అంటూ చిటికేస్తాడు. ఇంకేముంది.. సడన్‌గా రాధకు తుమ్ము రావడంతో చున్నీ వదిలేస్తుంది. రమేశ్‌ పడిపోతాడు.

మనం ఊహించినట్టు ఏదీ ఇక మీదట ఉండబోదని ఈ సంఘటనతో చెప్పకనే చెప్పాడు నాగ్‌. కంటెస్టెంట్ల ఆటలు చెల్లవని, బిగ్‌బాస్‌ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని చెప్తున్నాడు. ప్రోమోలు చూస్తుంటే అంతా పకడ్బందీగా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది మరి అదెంతమేరకు మెప్పిస్తుందో చూడాలి! ఇక ఈ సీజన్‌ సెప్టెంబర్‌ 3న గ్రాండ్‌గా లాంచ్‌ కానున్నట్లు సమాచారం. బ్యాంకాక్‌ పిల్ల, మోహన భోగరాజు, సాకేత్‌, అమర్‌దీప్‌, శోభా శెట్టి, శ్వేతా నాయుడు, వర్ష, బుల్లెట్‌ భాస్కర్‌, ప్రభాకర్‌ ఈసారి షోలో సందడి చేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది.

చదవండి: మూడో తరగతిలోనే అమ్మ చనిపోయింది: ఏడ్చేసిన బాబూ మోహన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement