Buzz: Mahesh Babu Buys Luxury Villa in Dubai - Sakshi
Sakshi News home page

Mahesh Babu: దుబాయ్‌లో విల్లా కొన్న సూపర్‌ స్టార్‌! రిజిస్ట్రేషన్‌ కోసమే అక్కడికి..

Published Mon, May 1 2023 8:35 AM | Last Updated on Wed, May 3 2023 11:09 AM

Buzz: Mahesh Babu Buys Luxury Villa in Dubai - Sakshi

ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అన్న డైలాగ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు సరిగ్గా సరిపోతుంది. తను ఏదైనా సినిమాకు కమిటయ్యాడంటే పాత్ర కోసం ఏదైనా చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు. దర్శకుడు చెప్పినట్లుగా నడుచుకుంటాడు. సినిమా పట్ల ఇంత అంకితభావం చూపించే మహేశ్‌ కుటుంబాన్ని ఎలా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాలా? సమయం దొరికితే చాలు కుటుంబంతో వెకేషన్‌కు‌ ప్లాన్‌ చేస్తుంటాడు. 

ఇటీవల ఫ్యామిలీతో కలిసి ప్యారిస్‌, జర్మనీకి హాలీడే ట్రిప్‌ వెళ్లొచ్చిన మహేశ్‌ శుక్రవారం మరోసారి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు. భార్యాపిల్లలను తీసుకుని దుబాయ్‌కు చెక్కేశాడు. అయితే అక్కడ మహేశ్‌ ఒక విలాసవంతమైన విల్లా కొన్నాడని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెస్టారెంట్‌, మల్టీప్లెక్స్‌ బిజినెస్‌ల ద్వారా భారీగా సంపాదిస్తున్న మహేశ్‌కు పలు నగరాల్లో లగ్జరీ విల్లాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా దుబాయ్‌లో సైతం ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తి చేసేందుకే ఆయన దుబాయ్‌ వెళ్లినట్లు టాక్‌! అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన సినిమాలపై ఫోకస్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా అతడు, ఖలేజా సినిమాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి మహేశ్‌బాబు ముచ్చటగా మూడోసారి చేస్తున్నాడు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానున్నట్లు మేకర్స్‌ ఇదివరకే ప్రకటించారు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు.

చదవండి: విరూపాక్ష కోసం చాలా రిస్క్‌ చేశా: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement