Charmme Kaur's Instagram Post Viral: Vijay Deverakonda Bangaaaaaram Is 26 Karat Gold - Sakshi
Sakshi News home page

విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఛార్మి, పోస్ట్‌ వైరల్‌

Published Mon, May 10 2021 8:01 PM | Last Updated on Mon, May 10 2021 9:36 PM

Charmme Kaur Shares Instagram Post Over Vijay Devarakonda - Sakshi

కొంతకాలంగా నటి, నిర్మాత ఛార్మి వార్తల్లో నిలుస్తోంది. తను పెళ్లికి రేడీ అయిపోయిందంటూ ఇటీవల సోషల్‌ మీడియాల్లో రూమర్స్‌ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. తాను అంత పెద్ద తప్పు చేయనంటూ క్లారిటీ ఇచ్చి అభిమానులకు షాకిచ్చింది ఛార్మి. తాజాగా హీరో విజయ్‌ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఛార్మి మరోసారి వార్తల్లో నిలిచింది. విజయ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. బంగారం.. 24 క్యారట్స్‌ గోల్డ్‌. నాకు, పూరి జగన్నాథ్‌కు నువ్వంటే ఎంత అపారమైన ప్రేమో’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. 

కాగా ఛార్మి, పూరితో కలిసి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సంయుక్తంగా ఈ బ్యానర్‌పై 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపొందించి భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం పూరీ విజయ్‌ దేవరకొండ హీరోగా ‘లైగర్‌’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్‌తో చార్మీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందులో విజయ్‌ సరసన బాలీవుడ్‌ భామ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. 

చదవండి: 
Vijay Devarakonda: ‘రౌడీ’ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇప్పట్లో కష్టమే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement