Odisha Train Accident Tragedy: Chiranjeevi And Jr NTR Express Grief, Urging Support - Sakshi
Sakshi News home page

Odisha Train Accident: వెంటనే ఆ పని చేయాలంటూ ఫ్యాన్స్‌కి చిరంజీవి విజ్ఞప్తి

Published Sat, Jun 3 2023 10:37 AM | Last Updated on Sat, Jun 3 2023 11:15 AM

Chiranjeevi And Jr NTR Tweets On Odisha Train Accident - Sakshi

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు, ఓ గూడ్స్‌ రైలు ఢీకొనటం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 237మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ పెను ప్రమాదంపై పలువు టాలీవుడ్‌ స్టార్స్‌ స్పందిస్తూ తగిన సాయం అందిస్తామని హామీ ఇస్తున్నారు.

ప్రమాదంలో గాయపడ్డవారి ప్రాణాలను రక్షించేందుకు రక్త యూనిట్లను దానం చేయాలని అభిమానులకు  మెగాస్టార్‌ చిరంజీవి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ‘ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాణాలను కాపాడేందుకు రక్త యూనిట్ల కోసం తక్షణ డిమాండ్ ఉందని నేను అర్థం చేసుకున్నాను. సాధ్యమైనంత మేరలో వెంటనే రక్త యూనిట్లు అందించాలని నా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్ట సమయంలో తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. 

ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించాడు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉంటూ బాధితులకు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement