మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గాడ్‌ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే రీసెంట్‌గా సెట్‌లో అనసూయకు చిరంజీవి వార్నింగ్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దీంతో అనసూయకు వార్నింగ్ ఎందుకు ఇచ్చారంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇది రియల్ లైఫ్‌లో జరిగింది కాదు.. కేవలం రీల్‌లో మాత్రమే. ఈ సినిమాలో అనసూయ నెగిటివ్ షేడ్స్‌తో కనిపిస్తుందట. ఓ సన్నివేశంలో షూటింగ్‌లో భాగంగా చిరంజీవి అనసూయకు వార్నింగ్ ఇస్తారట.
Comments
Please login to add a commentAdd a comment