‘కమిటీ కుర్రోళ్ళు’ వచ్చేస్తున్నారు | Committee Kurrollu Movie Release Date Out | Sakshi
Sakshi News home page

‘కమిటీ కుర్రోళ్ళు’ వచ్చేస్తున్నారు

Published Sun, Jul 21 2024 8:49 AM | Last Updated on Sun, Jul 21 2024 12:08 PM

Committee Kurrollu Movie Release Date Out

నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌లో వచ్చే ఫ్రెండ్‌షిప్‌ వీక్‌లో విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రయూనిట్‌ ప్రకటించింది.

‘‘ఈ చిత్రం ద్వారా పదకొండు మంది హీరోలను, నలుగురు హీరో యిన్లను పరిచయం చేస్తున్నాం. స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణలన్నింటినీ ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. సందీప్‌ సరోజ్, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా, మణికంఠ పరసు, లోకేష్‌ కుమార్‌ పరిమి తదితరులు ఈ చిత్రంలో నటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement