సరికొత్త దళారి  | Dalari Movie Releasing on December 15th | Sakshi
Sakshi News home page

సరికొత్త దళారి 

Published Fri, Dec 15 2023 3:45 AM | Last Updated on Fri, Dec 15 2023 3:45 AM

Dalari Movie Releasing on December 15th - Sakshi

షకలక శంకర్‌,రాజీవ్‌ కనకాల

రాజీవ్‌ కనకాల, ‘షకలక’ శంకర్‌ ప్రధాన పాత్రల్లో శ్రీతేజ్, అక్సా ఖాన్, రూపిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది’’ అన్నారు. ‘‘దళారి’ని  రెండు భాగాలుగా తీశాం.

ఇప్పుడు తొలి భాగం రిలీ జవుతోంది. ఇందులో మంచి కథ, యాక్షన్‌ ఉన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్‌ బాగా వచ్చింది’’ అన్నారు ‘షకలక’ శంకర్‌. ‘‘ఒక ఊరిలోని వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తి జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ఈ సినిమా కథ చేశాం’’ అన్నారు కాచిడి గోపాల్‌రెడ్డి. ‘‘త్వరలోనే దళారి 2’ చేస్తాం’’ అన్నారు వెంకట్‌ రెడ్డి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement