
అసలు దాని గురించి స్పందించడం కూడా మూర్ఖత్వమే. నేనసలు కామెంట్స్ కూడా చదవను. నా భర్త కూడా కామెంట్స్ చదవడు. ఛీ ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడాతారో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్. ఇందులో ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయింది దీపికా. మరి దీనికి భర్త పర్మిషన్ తీసుకున్నావా? అని కొందరు సోషల్ మీడియాలో హీరోయిన్‌ను నిలదీస్తూ ఆడేసుకుంటున్నారు. ఈ ప్రశ్నలు విని ఒంటికాలిపై లేచింది దీపికా.
తాజా ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. 'అసలు దాని గురించి స్పందించడం కూడా మూర్ఖత్వమే. నేనసలు కామెంట్స్ కూడా చదవను. నా భర్త కూడా కామెంట్స్ చదవడు. ఛీ ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడాతారో అనిపిస్తుంది. అయినా సినిమా చూశాక రణ్‌వీర్ గర్వంగా ఫీలవుతాడు. మరీ ముఖ్యంగా నా నటనకు మంత్రముగ్ధుడవుతాడు' అని బదులిచ్చింది దీపికా. షకున్ భత్రా దర్శకత్వం వహించిన గెహ్రియాన్‌లో సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈపాటికే విడుదల చేసిన ట్రైలర్‌లో దీపికా, సిద్ధాంత్ రొమాన్స్‌తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే!