Dipika Kakar Recalls Bad Financial Phase - Sakshi
Sakshi News home page

Dipika Kakar: డబ్బుల్లేక ఆటో మధ్యలో ఆపి నడుచుకుంటూ వెళ్లిపోయేదాన్ని

Published Tue, Jun 6 2023 1:19 PM | Last Updated on Tue, Jun 6 2023 2:59 PM

Dipika Kakar Recalls Bad Financial Phase - Sakshi

ఒకరి ఇంటికి పెయింగ్‌ గెస్టుగా వెళ్లాను. ముంబైలో ఐదింట నాలుగు వంతుల మంది అమ్మాయిలు చిన్న ఇంట్లో పెయింగ్‌ గెస్టుగానే అడ్జస్ట్‌ అయిపోతుంటారు. పెద్దగా సంపా

ఇండస్ట్రీలో తారలుగా వెలుగొందుతున్న ఎంతోమంది కష్టాల కడలిని దాటి వచ్చినవాళ్లే! బుల్లితెర నటి దీపిక కక్కర్‌ కూడా అదే కోవలోకి వస్తుంది. అయితే టీవీలో హిట్‌ షోలు చేస్తున్న సమయంలోనూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానంటోంది దీపిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా భర్త షోయబ్‌, నేను ఎన్నో కష్టాలు అనుభవించాం. ఇండస్ట్రీలో మాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగాం. అయినప్పటికీ పెళ్లి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జీవితంలో ఆటుపోట్లు సహజమే అవి ఎప్పుడైనా మనల్ని అటాక్‌ చేయొచ్చు.

అప్పుడప్పుడే ఎదుగుతున్నప్పటికీ కొంత డబ్బు వెనకేస్తూ ఉంటేనే ఆర్థికంగా బలంగా ఉంటాం. లేదంటే కష్టాలు తప్పవు. మొన్నటివరకు తల దాచుకోవడానికి గూడు దొరికిందని సంతోషించాం. కానీ ఇప్పుడు డ్రీమ్‌ హౌస్‌ కట్టుకుంటున్నాం. ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ మేము దాటుకుని వచ్చిన పరిస్థితులను మర్చిపోలేదు. నేను గతంలో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేసేందుకు ముంబై వచ్చాను. అప్పుడు నా చేతిలో చిన్న సూట్‌కేసు మాత్రమే ఉంది. ఒకరి ఇంటికి పెయింగ్‌ గెస్టుగా వెళ్లాను. ముంబైలో ఐదింట నాలుగు వంతుల మంది అమ్మాయిలు చిన్న ఇంట్లో పెయింగ్‌ గెస్టుగానే అడ్జస్ట్‌ అయిపోతుంటారు. పెద్దగా సంపాదన లేనప్పుడు ఇలాంటివి సర్దుకుపోక తప్పదు. వచ్చే రూ.12-15 వేల జీతానికి తిండి, అద్దె‌, జర్నీ, ట్రైనింగ్‌, మేకప్‌.. ఇలా అన్నీ సమకూర్చుకోవడం కష్టం కదా!

అలాగే రోజంతా పని చేసినప్పుడు రెండు పూటలా వండుకునేంత సమయం కూడా ఉండదు. నాకిప్పటికీ గుర్తు.. నేను ఆటోలో వెళ్తున్నప్పుడు మీటర్‌ వైపు అలా చూస్తుండేదాన్ని. నా దగ్గర ఎంత డబ్బు ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మీటర్‌లో నా దగ్గరున్నంత అమౌంట్‌ చూపించగానే మధ్యలోనే ఆపమని చెప్పేవాడిని. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లేదాన్ని' అని చెప్పుకొచ్చింది. కాగా దీపిక కక్కర్‌ సాసురాల్‌ సిమర్‌ కా, బాలికా వధు, కహాన్‌ కుమ్‌ కహాన్‌ తుమ్‌ వంటి పలు సీరియల్స్‌లో నటించింది. అలాగే బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొని విజేతగా అవతరించింది.

చదవండి: ఆ టార్చర్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement