మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చినవారు చాలామందే! హీరోయిన్ దిశాపటానీ కూడా ఆ జాబితాలోకే వస్తుంది. లోఫర్ అనే తెలుగు సినిమా ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ అందుకోవడం తనకు తెలుగులో అవకాశాలే కరువయ్యాయి. కానీ ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఇటీవల యోధ సినిమాలో కనిపించిన దిశా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ, తమిళంలో సూర్యతో కంగువా, హిందీలో వెల్‌కమ్ టు ద జంగిల్ చిత్రాలు చేస్తోంది.
ఏంటీ.. అంత రేటా?
ఈ మధ్య తరచూ కల్కి సెట్స్‌లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ టైట్ డ్రెస్‌లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. పేస్టల్ పింక్ కలర్‌లో ఉన్న ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ ఎంతనుకున్నారు? అక్షరాలా లక్ష యాభైవేల రూపాయలు. ఇది తెలిసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్లేన్‌గా ఓ పొడవాటి టీషర్ట్‌లా ఉన్న దానికి లక్షన్నరా? అని ఆశ్చర్యపోతున్నారు.
చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో నటుడి దాగుడుమూతలు.. చీకట్లో ఎవరో తెలీలేదు..
Comments
Please login to add a commentAdd a comment