జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది మార్చిన 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది.
చదవండి: ‘కేజీయఫ్’ను పాన్ ఇండియా అంటుంటే ఫన్నీగా ఉంది: సిద్ధార్థ్
అయితే చరిత్రలోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్నో ఎలివేషన్ సీన్స్ కనిపించాయి. ఎంట్రీ సీన్‌లో తారక్ పులితో చేసే పోరాటం, ఇంటర్‌వెల్‌కు ముందు ఒకేసారి కొన్ని అడవి జంతువులతో లారీ నుంచి దిగే సీన్, రామ్ చరణ్-పులి ఫైట్, అలాగే చెర్రిని పాము కరిచే షాట్ ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో అవి గ్రాఫిక్స్ చేసినట్లుగా కాకుండా నిజమైన జంతువులా కనిపించాయి.
చదవండి: ఆ సీన్స్‌తో మళ్లీ రిలీజవుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ!
అయితే ఈ సన్నివేశాల కోసం చిత్రం బృందం వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్‌ను ఉపయోగించారట. ఇదే విషయాన్ని తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ మేకర్స్ వెల్లడించారు. ఆయా సన్నివేశాల్లో Alzahravfx సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసిందో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది డీవీవీ మూవీస్. ఈ సందర్భంగా పులి, పాముని సృష్టించేందుకు సదరు సంస్థ 18 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌తో క్రియేట్ చేసిందని తెలిపింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment