Graphics Work
-
ధోనీ విగ్రహం చేసినతనే ఆదిపురుష్ గ్రాఫిక్స్ చేశాడా ...?
-
ఆర్ఆర్ఆర్లో పులి, పాము సీన్స్ ఇలా క్రియేట్ చేశారట
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది మార్చిన 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. చదవండి: ‘కేజీయఫ్’ను పాన్ ఇండియా అంటుంటే ఫన్నీగా ఉంది: సిద్ధార్థ్ అయితే చరిత్రలోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్నో ఎలివేషన్ సీన్స్ కనిపించాయి. ఎంట్రీ సీన్లో తారక్ పులితో చేసే పోరాటం, ఇంటర్వెల్‌కు ముందు ఒకేసారి కొన్ని అడవి జంతువులతో లారీ నుంచి దిగే సీన్, రామ్ చరణ్-పులి ఫైట్, అలాగే చెర్రిని పాము కరిచే షాట్ ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో అవి గ్రాఫిక్స్ చేసినట్లుగా కాకుండా నిజమైన జంతువులా కనిపించాయి. చదవండి: ఆ సీన్స్‌తో మళ్లీ రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ! అయితే ఈ సన్నివేశాల కోసం చిత్రం బృందం వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్‌ను ఉపయోగించారట. ఇదే విషయాన్ని తాజాగా ఆర్ఆర్ఆర్ మేకర్స్ వెల్లడించారు. ఆయా సన్నివేశాల్లో Alzahravfx సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసిందో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది డీవీవీ మూవీస్. ఈ సందర్భంగా పులి, పాముని సృష్టించేందుకు సదరు సంస్థ 18 వీఎఫ్ఎక్స్ షాట్స్‌తో క్రియేట్ చేసిందని తెలిపింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by DVV Entertainment (@dvvmovies) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యానిమేషన్... సూపర్విజన్
‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రీకరణ కరోనా వల్ల సాధ్యం కాకపోవడంతో రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చిన తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా ప్రభావం మెండుగా ఉండటంతో షూటింగ్ జరిపేందుకు మరికొంత సమయం వేచి ఉండాలని చిత్రబృందం అనుకుందట. ఈ ఖాళీ సమయంలో గ్రాఫిక్స్ వర్క్ పై ప్రత్యేక దృష్టి సారించారు రాజమౌళి. కాగా ఈ సినిమాలో కీలకమైన యానిమేషన్ ఎపిసోడ్స్ ఉన్నాయని టాక్. ఈ ఎపిసోడ్స్‌తో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రేక్షకులకు చెబుతారట రాజమౌళి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్స్‌కు సంబంధించిన వర్క్‌ను వర్చువల్‌గా సూపర్వైజ్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. సముద్రఖని, శ్రియ, అజయ్ దేవగన్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
దీపిక నడుముతో పెద్ద తలనొప్పి!
పద్మావత్ చిత్ర విడుదలకు క్లియరెన్స్ లభించినా మేకర్లకు మాత్రం చిక్కులు తప్పటం లేదు. ఓవైపు కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ.. మరోవైపు సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్రానికి మరమ్మత్తులు పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ కొత్త సమస్య ఎదురైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో గూమర్ సాంగ్‌లో పద్మావతిగా దీపిక వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. కానీ, కర్ణిసేన మాత్రం ఆ పాట పై కన్నెర్ర చేసింది. రాణి పద్మావతి అలా గంతులేయటం ఏంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సెన్సార్ బోర్డు ప్యానెల్ సభ్యులు ఆ పాటను కూడా ఎడిట్ చేయాల్సిందేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాటలో దీపిక నడుము కనిపించే షాట్లను తొలగించాలని సూచించింది. అయితే అది మొత్తం పాట పైనే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భన్సాలీ ఓ నిర్ణయానికి వచ్చాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ద్వారా దీపిక నడుమును కప్పిపుచ్చే యత్నం చేస్తున్నాడంట. అయితే ఈ ఎడిటింగ్ పనుల వల్ల చిత్రం జనవరి 25 తేదీన విడుదలయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముందు మాకు చూపించండి : రాజస్థాన్ హైకోర్టు పద్మావత్ చిత్రంపై దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు విచారణ చేపట్టింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతోపాటు దీపిక, రణ్వీర్లపైన గతేడాది మార్చిలో నగౌర్ జిల్లా దీవానా పోలీస్ స్టేషన్లో ఓ కేసు దాఖలైంది. అయితే ఆ అభియోగాలను కొట్టివేయాలంటూ భన్సాలీ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్.. అభ్యంతరాల నేపథ్యంలో ముందు చిత్రాన్ని తమ ముందు ప్రదర్శించాలని.. చూసి నిర్ధారించుకున్నాకే కేసును కొట్టివేస్తామని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై తదుపరి వాదనను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. 17 నుంచి నిరసన ప్రదర్శనలు చిత్తోర్‌ఘడ్ వేదికగా మరో ఉద్యమానికి రాజ్‌పుత్ కర్ణిసేన సిద్ధమవుతోంది. పద్మావత్ చిత్ర విడుదలను అడ్డుకునే దిశగా పెద్ద ఎత్తున్న ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం కర్ణిసేన ప్రతినిధులు హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. మరోవైపు కర్ణిసేన పెద్దలు 17న తేదీన పద్మావత్ చిత్రానికి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. -
చలో బొలీవియా
‘రోబో-2’ ఢిల్లీ షెడ్యూల్ పూర్తి గ్రాఫిక్స్ వర్క్‌లో శంకర్ దర్శకుడు శంకర్ ఇప్పుడు తీరికలేని పనిలో ఉన్నారు. రజనీకాంత్‌ను మరోసారి రోబోగా చూపిస్తూ, తీస్తున్న కొత్త చిత్రం ‘2.0’ షూటింగ్ వ్యవహారంతో తలమునకలుగా ఉన్నారు. దాదాపు గడచిన మూడు, నాలుగు వారాలుగా ఢిల్లీలోని నెహ్రూ స్టేడియమ్లో కీలక సన్నివేశాలను శంకర్, ఆయన బృందంలోని ఇతర నిపుణులు షూటింగ్ చేస్తూ వచ్చారు. హీరో రజనీకాంత్, విలన్‌గా నటిస్తున్న హిందీ నటుడు అక్షయ్ కుమార్ తదితరుల మీద వచ్చే ఆ స్టేడియమ్ దృశ్యాలను వారం, పది రోజుల క్రితమే పూర్తి చేశారు. శుక్రవారంతో ఢిల్లీ షెడ్యూల్ పూర్తి అయిపోయినట్లు సమాచారం. హీరో, విలన్, మరో కీలక పాత్రధారిణి అమీ జాక్సన్‌ల మీద కావాల్సిన దృశ్యాలను చిత్రీకరించిన దర్శకుడు అటుపైన ఆ దృశ్యాలకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ పనుల మీద పడ్డారు. కళాదర్శకుడు ముత్తురాజ్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు శ్రీనివాస మోహన్, కెమేరామన్ నీరవ్ షా, యాక్షన్ దృశ్యాల సారథి కెన్నీ బేట్స్లతో కలసి శంకర్ ఆ వ్యవహారంలో ఉన్నారు. మరోపక్క రజనీకాంత్ తన మరో చిత్రం ‘కబాలి’కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఆ పనులు పూర్తయ్యాక, మళ్ళీ ‘2.0’లోకి వచ్చేస్తారాయన. ‘‘ఈ స్వల్ప విరామం తరువాత యూనిట్ మొత్తం బొలీవియాకు వెళుతున్నాం. అక్కడ ఒకటి, రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని ‘2.0’ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఎమీ జాక్సన్, సుధాంశు పాండే తదితరులు నటించగా, ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు ప్రచారం.