Eesha Rebba Reveals About Her Two Childrens - Sakshi
Sakshi News home page

Eesha Rebba: ప్రేమకథ చెప్పమంటే పెళ్లికాకుండానే ఇద్దరు పిల్లలున్నారంటూ షాకిచ్చిన హీరోయిన్‌

Published Wed, Jul 19 2023 12:30 PM | Last Updated on Wed, Jul 19 2023 12:45 PM

Eesha Rebba Says She Have Two Kids - Sakshi

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగు హీరోయిన్స్‌లో ఈషా రెబ్బా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ఈషా. తెల్లగా ఉండుంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేసేదానివి అన్న మాటలను బేఖాతరు చేస్తూ ముందుకు సాగింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆఫర్లు అందుకుంది. ఓ పక్క హీరోయిన్‌గా, మరో పక్క ముఖ్య పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మ ‍ప్రస్తుతం మామా మశ్చీంద్ర సినిమా చేస్తోంది.

అలాగే తమిళంలోనూ ఓ మూవీ చేస్తోంది. ఇక 3 రోజెస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈషా.. ఇటీవలే మాయా బజార్‌ ఫర్‌ సేల్‌ అనే సిరీస్‌లో యాక్ట్‌ చేసింది. ఈ వెబ్‌ సిరీస్‌ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ షోలో పాల్గొన్న ఈషా.. తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? అన్న ప్రశ్నకు తొందరపడ్డప్పుడు అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత యాంకర్‌.. నీ ప్రేమకథ గురించి చెప్పు అని అడగ్గా.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వెల్లడించింది.

ఆమె మాటతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఈషా తనకు పిల్లలున్నారని చెప్పడంతో ప్రోమో పూర్తయింది. దీంతో అసలు నిజమేంటనేది తెలియరాలేదు. తను ఎవరినైనా దత్తత తీసుకుందా? లేదా తన బంధువుల సంతానాన్ని తన పిల్లలుగా పెంచుకుంటుందా? మరెవరినైనా చదివించే బాధ్యతను తన భుజాన వేసుకుని వారిని కన్నబిడ్డలుగా చూసుకుంటుందా? అదీ కాదంటే తన పెంపుడు కుక్కపిల్లల గురించి మాట్లాడిందా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే కొందరు మాత్రం ఈషా.. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లయిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది చివర్లో కోలీవుడ్‌ డైరెక్టర్‌తో ఈషా ప్రేమలో ఉందని, అతడిని పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి, కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.

చదవండి: స్టెరాయిడ్స్‌ వాడా.. ఆరు నెలలు బ్రేక్‌ తీసుకుంటున్నా: సాయిధరమ్‌ తేజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement