
‘ఆర్టికల్ 15’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో ఆయుష్మాన్ ఖురానా, దర్శకుడు అనుభవ్ సిన్హా కాంబినేషన్‌లో ‘అనేక్’ అనే సినిమా ఆరంభమైంది. రాజకీయాల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది.
‘‘అనుభవ్ సార్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా లుక్ ఇదిగో’’ అంటూ ఈ సినిమాలో తాను చేస్తున్న జోష్వా పాత్ర లుక్‌ను విడుదల చేశారు ఆయుష్మాన్ ఖురానా. వార్తల్లో ఉన్న ప్రకారం అనుభవ్ సిన్హా తెరకెక్కిస్తున్న తొలి భారీ బడ్టెట్ చిత్రం ఇదేనట. టి. సిరీస్ భూషణ్‌కుమార్, అనుభవ్ సిన్హా కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment