Hero Siddharth Announce His Next Movie, First Look Poster Release Viral - Sakshi
Sakshi News home page

Siddarth Movie Poster: త్రిభాషా చిత్రంలో సిద్ధార్థ్‌.. పోస్టర్‌ విడుదల

Apr 19 2022 2:14 PM | Updated on Apr 19 2022 3:11 PM

Hero Siddarth Announces His Next Movie And Releases Poster - Sakshi

నటుడు సిద్ధార్థ్‌ చిన్న గ్యాప్‌ తర్వాత రీచార్జ్‌ అవుతున్నారు. బహుభాషా నటుడైన ఈయన ఇటకీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తాజాగా నిర్మిస్తున్న త్రిభాషా చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇంతకుముందు కాదల్‌ సొదప్పువదు ఎప్పడీ, జిల్‌ జంగ్‌ జక్, అవళ్‌ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ నిర్మిస్తున్న 4వ చిత్రం ఇది. ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. 

ఈయన ఇంతకుముందు విజయ్‌ సేతుపతి హీరోగా పన్నైయూరుమ్‌ పద్మినియుమ్, సేతుపతి మంత్రి వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంకా పేరు నిర్ణయించలేదు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ అద్భుతమైన క్లాసికల్‌ కథ కుదిరిందని, చిత్రం షూటింగ్‌ తమిళనాడులోని పళనిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement