
Hyper Aadi Release Video: హైపర్ ఆది... బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమీ పేరు. పంచులతో, తనదైన కామెడీ టైమింగ్‌తో జోక్స్ పేల్చుతూ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాడీ కమెడియన్. అయితే తరచూ వివాదాల్లో ఉండే హైపర్ ఆదిపై గత రెండు మూడు రోజులుగా కొన్ని వార్తలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఆదిపై దాడి జరిగిందని కొందరు.. లేదు, దాడి చేయడానికి ఓ హీరో అభిమానులు ఎదురు చూస్తున్నారని మరికొందరు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవన్నీ వుట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు హైపర్ ఆది. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు.
'నాపై దాడి చేయడం కోసం ఎవరో వెతుకుతున్నారంటూ ఏవేవో ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయి. మీ ఫేక్ న్యూస్‌లు రాసేవారికి ఒకటే చెప్తున్నా.. మీ దగ్గర డబ్బుల్లేవంటే చెప్పండి, నేను సంపాదించేదాంట్లో కొంత తీసి మీకిస్తాను. మేమందం హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండండి, మేమూ హ్యాపీగా ఉన్నాం' అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.
Comments
Please login to add a commentAdd a comment